హీరోగా తెరంగేట్రం చేయనున్న బిగ్ బి మనవడు!
on Jul 11, 2020

హిందీ సినిమా చరిత్రలో అమితాబ్ బచ్చన్‌ని చెరగని సంతకం. బాలీవుడ్ షెహన్‌షాగా ప్రసిద్ధుడైన ఆయనొక నట శిఖరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా బాక్సాఫీస్‌ను ఏలుతూ వస్తోన్న ఆయన అభినయ సామర్థ్యానికి గీటురాళ్లుగా నిలిచిన పాత్రలెన్నో. అలాంటి నటులు జీవిత కాలంలో ఒకరే ఉంటారు. ఆయన వారసుడిగా కుమారుడు అభిషేక్ బచ్చన్ సినిమాల్లోకి వచ్చాడు కానీ ఆయనలాంటి ఇమేజ్‌ను ఇంతవరకూ పొందలేకపోయాడు.
ఇప్పుడు అమితాబ్ మనవడు ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. అవును. అమితాబ్ కుమార్తె శ్వేతా నందా కుమారుడు అగస్త్య నందా సినిమాల్లోకి రావాలనే కుతూహలంతో ఉన్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అతని వయసు 19 సంవత్సరాలు. తాతయ్య పోలికలు ఎక్కువగా ఉన్న అగస్త్యకు ఇప్పటికే పలు అవకాశాలు వచ్చాయని తెలుస్తోంది. తెరంగేట్రానికి వాటిలో ఏది కరెక్టో నిర్ణయించుకున్నాక అధికారిక ప్రకటన రావచ్చునని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అగస్త్య పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు, దర్శకులు భావించడంలో ఆశ్చర్యమేముంది!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



