మన హద్దుల్లో మనం ఉంటే అడ్డే లేదంటున్న శ్రీలీల!
on Jul 28, 2023

'పెళ్లి సందడి'తో తెలుగుతెరకు పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రెండు సినిమా 'ధమకా'తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కేవలం రెండు సినిమాలతోనే తన గ్లామర్, డ్యాన్స్ లతో ఆకట్టుకున్న శ్రీలీల చేతిలో ప్రస్తుతం దాదాపు పది సినిమాలు ఉంటాయి. ఇలా అతికొద్ది కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన శ్రీలీల, కొత్తగా వచ్చేవారికి సలహాలు ఇస్తోంది. మన హద్దుల్లో మనం ఉండి సినిమాలు చేసుకుంటూ పోతే మనకు అడ్డే ఉండదని ఆమె చెబుతోంది.
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హజ్బెండ్'. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. విభిన్న కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రేపు(జూలై 29న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా శ్రీలీల అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
"భగవంత్ కేసరిలో బ్రహ్మాజీ గారు, మేము సీన్స్ చేస్తున్నప్పుడే ఈ సినిమా గురించి తెలిసింది. వాళ్ల అబ్బాయి సంజయ్ హీరోగా నటించారు. బ్రహ్మాజీ గారిలాగే మంచి పర్మార్మెన్స్ చేసి ఉంటారు. ప్రణవి తెలుగు అమ్మాయి. ఇదొక గౌరవం ఉన్న ఇండస్ట్రీ. మన హద్దుల్లో మనం ఉండి సినిమాలు ఎంపిక చేసుకుంటే అడ్డేదీ ఉండదు. ఎలాంటి ఇబ్బందులు రావు. ప్రణవికి నేను ఇచ్చే సలహా ఇదే. భీమ్స్ ధమాకా తర్వాత మళ్లీ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్." అని శ్రీలీల అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



