ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో అన్న జపాన్ మంత్రి!
on Jul 28, 2023

జపాన్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న అతి కొద్దిమంది ఇండియన్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అక్కడ ఎన్టీఆర్ డ్యాన్స్ లకు ఎందరో అభిమానులున్నారు. ఎన్టీఆర్ ని కలవడానికి జపాన్ నుంచి అభిమానులు ఇండియాకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ జపాన్ మంత్రి సైతం తాను ఎన్టీఆర్ కి అభిమానిని అని చెప్పడం విశేషం.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా జపాన్ లో సంచలన వసూళ్లతో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 'ఆర్ఆర్ఆర్' కారణంగా జపాన్ లో ఎన్టీఆర్, చరణ్ లకు కొత్తగా ఎందరో అభిమానులు వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇండియన్ సినిమాలకు జపాన్ లో మంచి గుర్తింపు వస్తోందని, ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ను జపాన్ ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారని చెప్పారు. అలాగే ఆర్ఆర్ఆర్ లో నటించిన 'రామారావు జూనియర్' తన అభిమాన నటుడని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా జపాన్ మంత్రి తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని చెప్పడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



