Home

»

Latest News

శ్రీలీల ఓపెన్ కామెంట్స్: చిన్న వయసులో తప్పులు చేశా.!

Nov 17, 2026 10:12AM

వరుస సినిమాలతో బిజీగా ఉండే యంగ్ హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. కెరీర్ ఆరంభంలోనే వరుస అవకాశాలు అందుకుని టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరిస్తూ సినిమాలు చేసి కొన్ని షాకులు తిన్న శ్రీలీల.. ఇప్పుడు తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నారట. కథల ఎంపిక విషయంలో గతంలో కొన్ని తప్పులు చేశానని, ఇకపై ఆచితూచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో తన కెరీర్ గురించి శ్రీలీల మనసు విప్పి మాట్లాడారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రావడంతో అప్పట్లో కథలను ఎంచుకునే స్థాయిలో తాను లేనని, వచ్చిన అవకాశాలను అంగీకరిస్తూ ముందుకు వెళ్లానని తెలిపారు. ప్రేక్షకులు తనపై ఎంతో ప్రేమ చూపించారని, అయితే కొంతకాలం తర్వాత తన నిర్ణయాలను తానే సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు చెప్పారు.

మనకు నచ్చిన కథలను ఎంచుకోవడం మొదలుపెట్టినప్పుడే జీవితంలో మార్పు వస్తుందని ఎవరో చెప్పిన మాట తనపై ప్రభావం చూపిందని వెల్లడించారు. అప్పటివరకు వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లానని, కానీ తన కెరీర్‌లో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి? ఇంకా ఏం నేర్చుకోవాలి? అని ఆలోచించుకున్నానని తెలిపారు. సరిగ్గా అదే సమయంలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ‘ఓం’ కథ చెప్పారని, ఇందులో పాటలు ఉండవని ఆయన ముందే చెప్పడంతో తనకు చాలా కొత్తగా అనిపించిందని వివరించారు.

తనను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించే పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి శ్రీలీల కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఇకపై కేవలం కమర్షియల్ అవకాశాలకే పరిమితం కాకుండా, తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోవాలని శ్రీలీల  భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి: 15 ఏళ్ల ‘కొలవెరి డి’.. ఆరు నిమిషాల్లో రాసిన పాట ప్రపంచాన్ని ఊపేసింది.!

ఇదే ఈవెంట్‌లో సాయిపల్లవి గురించి శ్రీలీల చెప్పిన మాటలు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. తాను మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్ష రాస్తున్న సమయంలోనే ‘ఫిదా’ సినిమా విడుదలైందని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఒక డాక్టర్ అమ్మాయి హీరోయిన్‌గా నటించడం తమ ఇంట్లో అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ఇప్పుడు తాను కూడా మెడిసిన్ పూర్తి చేసి, సాయిపల్లవితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 

దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీలతో పాటు రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. నవంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది.

మీకు నచ్చవచ్చు:
ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!
‘కాకా’లో స్పెషల్ సాంగ్.. మెగాస్టార్‌తో రితికా సింగ్ మాస్ స్టెప్పులు.!

 

 

 

[OM Movie, Sreeleela, Dhanush, Sai Pallavi, Renu Desai]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com