
15 ఏళ్ళ క్రితం ఎక్కడ చూసినా ఒకటే పాట వినిపించేది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు.. వయసుతో, భాషతో సంబంధం లేకుండా అందరూ ఆ పాటను పాడుకునేవారు. అదే ‘వై దిస్ కొలవెరి డి’. ధనుష్ సింగింగ్, అనిరుధ్ మ్యూజిక్, సులభంగా పాడుకునే లిరిక్స్ తో.. ఈ పాట ఓ సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ పాట విడుదలై 15 ఏళ్లు పూర్తయ్యాయి.
2011 నవంబర్ 16న యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట అప్పట్లో ఇంటర్నెట్ను ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ఉన్నంతగా సోషల్ మీడియా విస్తరించని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం విశేషం. మరి అసలు ఈ పాట ఎలా పుట్టింది? అనిరుధ్, ధనుష్ కలిసి అనుకోకుండా చేసిన ప్రయోగం ఎలా ఓ సంచలనంగా మారింది?
‘కొలవెరి డి’ పాట తమిళ సినిమా ‘3’ కోసం రూపొందింది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్, శ్రుతి హాసన్ జంటగా నటించారు. ప్రేమలో విఫలమైన ఓ యువకుడి భావోద్వేగాలను సరదాగా వ్యక్తం చేసే పాట కావాలని ఐశ్వర్య సూచించడంతో అనిరుధ్ ట్యూన్ సిద్ధం చేశారు.
అప్పటికి అనిరుధ్ వయసు కేవలం 21 ఏళ్లు. సంగీత దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా. ఈ పాట ట్యూన్‌ను కొద్ది నిమిషాల్లోనే కంపోజ్ చేశారట. అనిరుధ్ వేసిన ట్యూన్ విన్న ధనుష్ సరదాగా కొన్ని పదాలు పాడటం మొదలుపెట్టారు. అలా వచ్చిన ‘వై దిస్ కొలవెరి డి’ అనే లైన్ పాటకు ప్రధాన ఆకర్షణగా మారింది.
ఇది కూడా చదవండి: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. మెగాస్టార్‌తో రితికా సింగ్ మాస్ స్టెప్పులు.!
ఇక లిరిక్స్ విషయానికి వస్తే.. ధనుష్ ఓ ఇంటర్వ్యూలో ఈ పాటను కేవలం ఆరు నిమిషాల్లో రాసినట్లు వెల్లడించారు. రోజువారీ జీవితంలో మనం ఉపయోగించే సాధారణ ఇంగ్లిష్ పదాలనే పాటలో పెట్టానని చెప్పారు. ఇంగ్లిష్ పదాలు ఉన్నప్పటికీ వాటిని తమిళ యాసలో పాడటం వల్లే పాటకు ప్రత్యేకమైన ఫ్లేవర్ వచ్చిందని వివరించారు.
ఈ పాటను మొదట్లో ప్రత్యేకంగా సింగిల్‌గా విడుదల చేయాలనే ఆలోచన లేదట. సినిమా ఆల్బమ్‌లో భాగంగా మాత్రమే ఉంచాలనుకున్నారు. అయితే పాటకు సంబంధించిన రఫ్ వెర్షన్ అనుకోకుండా ఇంటర్నెట్లోకి వెళ్లి వైరల్ కావడం మొదలైంది. దీంతో స్పందనను గమనించిన ధనుష్, అనిరుధ్.. వెంటనే పాటను పూర్తి చేసి అధికారికంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని ధనుష్ గతంలో వెల్లడించారు.

అలా 2011 నవంబర్ 16న ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు హంగామా. కొన్ని రోజుల్లోనే లక్షలాది వ్యూస్.. ఆ తర్వాత మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఫేస్బుక్, యూట్యూబ్‌లలో ఎక్కడ చూసినా ఈ పాటే కనిపించేది. అప్పట్లో వైరల్ అనే పదానికి నిజమైన అర్థం చూపించిన పాటల్లో ఇదొకటిగా నిలిచింది.
‘కొలవెరి డి’ క్రేజ్ తమిళనాడుకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ పాటను ప్రశంసించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ‘కొలవెరి డి’ పాట సృష్టించిన సంచలనం ‘3’ సినిమాకు కూడా భారీ హైప్ తీసుకొచ్చింది. కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది.
అయితే ఈ పాట అనిరుధ్‌కు సంగీత దర్శకుడిగా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ధనుష్‌కు గాయకుడిగా, గేయ రచయితగా దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. అప్పట్లో ఓ చిన్న స్టూడియో సెషన్లో సరదాగా పుట్టిన పాట.. తర్వాత ప్రపంచవ్యాప్తంగా మారుమోగడం నిజంగా అరుదైన విషయం.
మీకు నచ్చవచ్చు:
‘వారణాసి’ నుంచి అఫీషియల్ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి బ్లాస్టింగ్ న్యూస్.!
ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!
[Why This Kolaveri Di, 15 Years, Dhanush, Anirudh Ravichander]





