ప్రభాస్‌కి ఆ స్టామినా ఉందంటున్న బ్యూటీ
on Jun 8, 2023
ఇప్పుడు ఎక్కడ విన్నా రామనామమే. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా వార్తలే. ఆదిపురుష్ గురించి లేటెస్ట్ గా నటి సోనాల్ చౌహాన్ కూడా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఓమ్‌రవుత్ దర్శకత్వం వహించిన సినిమా ఆదిపురుష్. జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది ఈ చిత్రం. తొలిసారి ప్రభాస్ పౌరాణిక పాత్రలో నటించారు. ఆయన కెరీర్‌లో ఫస్ట్ త్రీడీ సినిమా కూడా ఇదే. ఈ చిత్రం గురించి సోనాల్ మాట్లాడుతూ ``ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చూశాక బాలీవుడ్ దృష్టి మారిపోతుంది. ఆదిపురుష్‌కి ముందు, ఆదిపురుష్ తర్వాత అని మాట్లాడుకుంటారు జనాలు. ఓం రవుత్ అంత అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు`` అని అన్నారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఓ రోల్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. టీమ్ ఆమెను అప్రోచ్ అయినప్పుడు అసలు కథనుగానీ, తన పాత్ర గురించిగానీ అడగలేదట సోనాల్. ఇన్‌స్టంట్‌గా ఒప్పుకున్నారట.
ఈ సినిమా కోసం లీడింగ్ లేడీగా జాక్వలిన్ పేరు కూడా వినిపించింది. అయితే సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో ఆమె ఉన్నారని తెలిసి డ్రాప్ అయ్యారు మేకర్స్. ఆదిపురుష్‌లో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, దేవ్‌దత్త నాగె, సన్నీ సింగ్, వత్సల్ సేథ్ కీ రోల్స్ చేశారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీలో విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ పేరుగానీ, ఆమె నటించిన పాత్ర గురించి కానీ, అఫిషియల్‌గా రివీల్ చేయలేదు ఆదిపురుష్ మేకర్స్. దీంతో ఆమె ఈ సినిమాలో ఉన్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో చివరిగా నాగార్జున సరసన ఘోస్ట్ లో నటించారు సోనాల్. 2008లో రొమాంటిక్ డ్రామా జన్నత్‌తో లీడింగ్ లేడీగా సినీ ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ టైగర్3లో నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ మేకర్స్ కూడా సోనాల్ ప్రెజెన్స్ గురించి అఫిషియల్‌గా ప్రకటించలేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
