అంచనా.. బిగ్ బాస్ 4 టాప్ 5 ఫైనలిస్టులెవరో తెలుసా?
on Nov 19, 2020

బిగ్ బాస్ 4 క్రమంగా క్లైమాక్స్‌కు వచ్చేస్తోంది. ఇప్పుడు అందరి మనసుల్నీ తొలుస్తున్న ప్రశ్న.. విజేతగా ఎవరు నిలుస్తారు? అనేది. ఎవరు ఆ టైటిల్ గెలుస్తారో చూడాలని రెగ్యులర్‌గా ఆ షోను వాచ్ చేస్తున్న వాళ్లంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే డిసెంబర్ నెలాఖరు దాకా దాని కోసం వెయిట్ చేయక తప్పదు. ఈలోగా బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరవుతారో సోషల్ మీడియాలో రకరకాల అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.
గత మూడు సీజన్లతో పోలిస్తే టేకాఫ్ బ్రహ్మాండంగా ఉందనిపించిన నాలుగో సీజన్ ఆ తర్వాత ఆదరణ కోల్పోయి, ఎట్టకేలకు తిరిగి వీక్షకుల అటెన్షన్‌ను సాధించింది. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఫైట్లు, గొడవలు, మాటలతో వేధించుకోవడాలతో షోలో మసాలా పెరుగుతూ రావడంతో వ్యూయర్‌షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అంచనాల ప్రకారం చూస్తే.. టాప్ కంటెస్టెంట్లలో కచ్చితంగా ఉంటాడనుకున్న అఖిల్ సార్ధక్‌కు టాప్ 5లో చోటు దక్కలేదు.
అభిజిత్, సయ్యద్ సొహేల్, దేత్తడి హారిక, లాస్య, అవినాష్ లను టాప్ 5 కంటెస్టెంట్లుగా ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. బిగ్ హౌస్‌లో అభిజిత్ ప్రవర్తన అతడికి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. దాంతో అతను ఎన్నిసార్లు ఎలిమినేషన్ లిస్ట్‌లోకి వచ్చినా ఫ్యాన్స్ అతడిని గట్టెక్కిస్తూ వస్తున్నారు. అతడిని విన్నర్‌గా నిలపాలని వాళ్లు తపిస్తున్నారు. ఇక గేమ్స్ ఆడటంలో సయ్యద్ సొహేల్ నైపుణ్యం ఎక్కువ మందిని ఆకట్టుకుంది. అతడు వ్యక్తం చేస్తున్న ఫీలింగ్స్, ఎమోషన్స్ జెన్యూన్‌గా ఉంటున్నాయని చాలామంది భావిస్తున్నారు. అభిజిత్‌కు అతను ప్రధాన పోటీదారుగా ఆడియెన్స్ అంచనా వేస్తున్నారు.
.jpg)
దేత్తడి హారిక హౌస్‌లో నడుచుకుంటున్న విధానం, ఆమె స్నేహశీల స్వభావం చాలామందిని ఇంప్రెస్ చేస్తోంది. అందుకే ఆమెకంటూ అభిమాన గణం తయారయ్యింది. వారంతా ఆమెను సపోర్ట్ చేస్తూ, ఎలిమినేట్ కాకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఈసారి విన్నర్‌గా ఒక లేడీ నిలుస్తుందని, ఆ లేడీ హారికేనని నమ్ముతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. హౌస్‌లోకి రాకముందే యాంకర్‌గా లాస్యకు కొంత ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్ల హౌస్‌లో ఆమె గేమ్స్ ఎలా ఆడినా వారు ఆమె పక్షం ఉంటున్నారు. సానుభూతి కూడా ఆమెకు కలిసొస్తున్న అంశం. తన చిన్నారి కొడుకును వదిలేసి మరీ ఆమె ఈ షోలో పార్టిసిపేట్ చేస్తుండటమే ఆ సానుభూతికి కారణం.
ఇక టాప్ 5లో నిలుస్తోన్న మరో కంటెస్టెంట్ నిన్నటి జబర్దస్త్ అవినాష్. ఈ షో తర్వాత జబర్దస్త్‌లో అతడికి ప్రవేశం ఉండదనే ప్రచారం అవినాష్‌పై సానుభూతిని కలిగిస్తోంది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటరైన అతను జబర్దస్త్‌లో మాదిరిగా ఇక్కడ ఎంటర్‌టైన్ చేయకపోయినా ప్రేక్షకులు అతడిపై సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నారు. ఇదే అతడిని టాప్ 5 కంటెండర్‌గా నిలుపుతోంది. అయితే అతను విన్నర్ అయ్యే చాన్సులు చాలా తక్కువగా ఉన్నాయనేది ఎక్కువమంది అభిప్రాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



