ఫ్యాన్స్‌కు అపాలజీస్ చెప్పిన షారుఖ్.. రీజన్ ఇదే!
on Nov 19, 2020

బాలీవుడ్ బాద్‌షాగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ దాదాపు మూడు దశాబ్దాల సినిమా కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో నటించి, తన విలక్షణ నటనతో అభిమానులను ఉర్రూతలూగిస్తూ వస్తున్నాడు. అయితే ఒక విషయంలో మాత్రం ఆయన అభిమానులు కాస్త ఇబ్బందిపడుతూ ఉంటారు. అది ఆయన స్మోకింగ్ హ్యాబిట్!
షారుఖ్ ఖాన్ చైన్ స్మోకర్ అనే విషయం చాలా మందికి తెలిసిందే. అనేక ఇంటర్వ్యూల్లో పొగతాగడం మానాలనుకుంటున్నాననీ, అది చెడు అలవాటనీ చెప్పాడు కూడా. అయితే తన ధూమపానం అలవాటుపై ఫ్యాన్స్‌కు షారుఖ్ క్షమాపణలు చెప్పాడనే విషయం మీకు తెలుసా? ఈ ఘటన 2006లో 'డాన్' మూవీ ప్రమోషన్స్ సందర్భంగా చోటు చేసుకుంది. ఆ ప్రమోషన్ షోలో పాల్గొన్న ఆడియెన్స్‌లో ఒకరు చైన్ స్మోకర్ అయిన మీరు క్యాన్సర్ వ్యతిరేక ప్రొడక్ట్‌ను లాంచ్ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
దీనికి షారుఖ్ స్పందించాడు. "అవును ఇది విడ్డూరమే. చూడండి.. నేనింక పోలియో ఇంజెక్షన్లు వేయించుకోను. కానీ ప్రజలకు పోలీయో ఇంజెక్షన్లు తీసుకోమని చెప్తాను. దీన్ని మాటిమాటికీ చెప్తూనే ఉంటాను. స్మోకింగ్‌ను మానడానికి నేను ప్రయత్నిస్తున్నా. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అది ఎంత వీలైతే అంత త్వరగా నేను చేయాలి. ఏదైనా ప్రొడక్ట్‌ను లాంచ్ చేసేటప్పుడు, అది నాకు డబ్బు ఇస్తుందంటే నేను చేస్తాను. అలాగే ఏదైనా ప్రొడక్ట్ దేశానికి మంచి చేస్తుందంటే దానికి చేస్తాను" అని చెప్పాడు.
క్యాన్సర్ వ్యతిరేక ప్రొడక్ట్‌ను లాంచ్ చేయడం వెనుక ఉన్న ఎమోషనల్ రీజన్‌ను ఆయన షేర్ చేసుకుంటూ, "ఆ కంపెనీ నన్ను పిలిచిన రోజు మా నాన్న వర్ధంతి రోజు. ఆయన క్యాన్సర్‌తో చనిపోయారు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ప్రార్థన చేస్తున్నట్లు నాకనిపించింది. విడ్డూరాన్ని పక్కనపెడితే, స్మోకింగ్ అనేది మంచిది కాదని నేను భావిస్తున్నాను. నేను స్మోక్ చేస్తున్నందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. దాన్ని మానడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



