మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్ మృతి.. ఎస్ కే ఎన్ ఏం చేసాడో తెలుసా!
on Oct 17, 2025

'బేబీ' మూవీతో నిర్మాతగా బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు 'ఎస్ కే ఎన్'(SKN).ప్రస్తుతం 'ప్రభాస్' అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Rajasaab)కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో సైతం ఎస్ కే ఎన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా సందర్భాల్లో ఎస్ కే ఎన్ మాట్లాడిన మాటలు సదరు సోషల్ మీడియాలో వైరల్ గాను నిలుస్తుంటాయి.
రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమాని అయిన 'రాజేష్' మరణించడం జరిగింది. దీంతో రమేష్ నాయక్ అనే మరో మహేష్ అభిమాని ఎక్స్ వేదికగా ఎస్ కె ఎన్ కి ఈ విషయాన్ని తెలియచెయ్యడంతో పాటు, చనిపోయిన రాజేష్ కి పది సంవత్సరాల కొడుకు, ఆరు సంవత్సరాల కూతురు ఉంది. ఏదైనా హెల్ప్ చెయ్యమని రిక్వెస్ట్ చేసాడు. ఈ విషయంపై ఎస్ కే ఎన్ స్పందిస్తు 'పిల్లల చదువులు ఆగిపోకూడదు, నేను కూడా ఓ హీరో ఫ్యాన్‌నే. మరొక అభిమాని బాధ నాకు అర్ధమవుతుంది. అందుకే ఆ కుటుంబానికి 2లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నాను. అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ త్వరలోనే పూర్తిచేస్తా. ఇతరులు కూడా ఎవరికి తోచినంత సాయం ఆ కుటుంబానికి చేయండి’ అని ట్వీట్ చేసాడు. దీంతో ఎస్‌కేఎన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది.. కానీ సాయం చేసే గుణం నీలాంటి మంచి మనసున్న వారికే ఉంటుంది, మీరు మెగా ఫ్యాన్ మాత్రమే కాదు మంచి మనిషి కూడా అంటు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఎస్ కే ఎన్ చిరంజీవి(Chiranjeevi)కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. అల్లు అర్జున్(Allu Arjun)కి సన్నిహితుడు కావడంతో పాటు, అల్లు అర్జున్ సంస్థ గీతా ఆర్ట్స్ కి సంబంధించిన వ్యవహారాలు కూడా చూస్తుంటాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



