నితిన్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ వచ్చాడా!
on Oct 17, 2025

తెలుగు చిత్రసీమలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)నితిన్(Nithiin)కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సుదీర్ఘ కాలం నుంచి సిల్వర్ స్క్రీన్ పై తమదైన పెర్ ఫార్మెన్స్ తో అభిమానులని ప్రేక్షకులకి అలరిస్తు వస్తున్నారు. కాకపోతే కొంత కాలం నుంచి ఈ ఇద్దరికి విజయం అనేది ఆమడ దూరంలో ఉంటు వస్తుంది. సదరు చిత్రాల్లో పెర్ ఫార్మెన్స్ పరంగా తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించినా, కథతో పాటు కథనం లోని లోపాల వల్ల పరాజయం చెందుతున్నాయి. ఆ ఇద్దరి ప్రీవియస్ చిత్రాలైన తమ్ముడు, కింగ్ డమ్ లే ఉదాహరణ.
ఈ ఇద్దరిలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో 'రౌడీ జనార్దన్' అనే చిత్రంతో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రుత్యియన్ దర్శకత్వంలో మూవీ ఉంది. నితిన్ నుంచి మాత్రం కొత్త చిత్రం ప్రకటన రాలేదు. వేణు దర్శకత్వంలో తెరకెక్కబోయే 'ఎల్లమ్మ' కి మొదట నితిన్ ని అనుకున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ లోకి వేరే హీరో వచ్చాడు. రీసెంట్ గా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నితిన్ ని అనుకున్న మరో ప్రాజెక్ట్ లోకి విజయ్ దేవరకొండ వచ్చినట్టుగా తెలుస్తుంది. నితిన్ తో అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ 'మనం' మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం అనుకుంది. ఈ మేరకు గతంలో వార్తలు కూడా వచ్చాయి.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ ఖాతాలో చేరినట్టుగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కి విక్రమ్ కథ చెప్పాడని, విజయ్ కి కూడా నచ్చడంతో త్వరలోనే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన రానుందని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. విభిన్న చిత్రాలని తెరకెక్కించే దర్శకుడిగా అయితే విక్రమ్ కుమార్(Vikram k kumar)కి ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



