శివశంకర్ మాస్టారికి కుటుంబ కష్టాలు..!
on Jun 1, 2016

బుల్లితెరపై డ్యాన్స్ కార్యక్రమాలకు జడ్జిగా బాగా ఫ్యామస్ అయ్యారు శివశంకర్ మాస్టార్. ఆయన ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ చేసినా వాటికంటే, జడ్జిగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కే ఆయనకు పేరు వచ్చింది. అయితే గత కొన్నాళ్లుగా ఆయన టీవీల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన్ను వెంటాడుతున్న కుటుంబపరమైన కష్టాలే అందుకు కారణమట. తమను జయలలిత ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటున్నాడాయన. వివరాల్లోకి వెళ్తే శివశంకర్ పెద్ద కుమారుడు విజయకృష్ణ బెంగుళూరుకు చెందిన జ్యోతి అనే అమ్మాయిని మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే విభేదాలు రావడంతో, ఇద్దరూ విడాకులకు అప్లై చేశారు. తాజాగా, తనను అత్తమామలు కట్నం కోసం వేధించారంటూ జ్యోతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తనను, తన కుటుంబసభ్యులను కట్నం కోసం చాలా హింసించారని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. మరో వైపు శివశంకర్ మాత్రం, తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని కాజేయడానికే ఆమె బ్లాక్ మెయిలింగ్ చేస్తోందని, 10 కోట్లు ఇవ్వకపోతే కుదరదని బెదిరిస్తోందని, ఆమెకు ఇష్టమైతే ఇప్పటికీ కలిసుండటానికి తాము సిద్ధమేనని అంటున్నారు. తమ మీద ఆమె చేసే తప్పుడు ఆరోపణల కారణంగా తమ కుటుంబం మానసికంగా కుంగిపోతోందని, తమను అమ్మ జయలలిత ఆదుకోకపోతే, ఆత్మహత్యే శరణ్యం అంటున్నారు శివశంకర్. తమిళనాట ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదంపై శివశంకర్ కోరినట్టుగా జయలలిత స్పందిస్తారో లేదో చూడాలి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



