ఛార్మీ ముద్దులు పెట్టించేసుకుంటోంది..!
on Jun 1, 2016
ఆఫర్లు పెరగడం కోసం ఎన్నెన్ని చేయాలో అన్నీ చేసింది ఛార్మి. కానీ కారణం ఏంటో తెలీదు గానీ, ఈ పాప క్లిక్కవ్వలేదు. గ్లామర్ ఆరబోసింది. ఒళ్లు తగ్గింది. పెంచింది. ఐటెం సాంగ్స్ చేసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ చేసింది. ఇన్ని చేసినా, స్టార్ హీరోయిన్ ప్లేస్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే ఛార్మికి ధైర్యం చాలా ఎక్కువ. పరిశ్రమలో ఇంకా తన స్థానం కోసం పోరాటం చేస్తూనే ఉందీ బొద్దు భామ. అయితే లోపల ఎంత దిగులు ఉందో తెలీదు కానీ, బయటికి మాత్రం లైఫ్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటుంది. చేతిలో సినిమాల్లేకపోయినా, ఫ్రెండ్స్ తో పార్టీలు టూర్లు అంటూ మంచి జోరు మీద ఉంది. రీసెంట్ గా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన పార్టీ విశేషాలను తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసుకుంది. ఫోటోల్లో ఎవరో భామ, ఛార్మీపై ముద్దుల వర్షం కురిపించేస్తోంది. ఛార్మీ కూడా తన ఫ్రెండ్ ఇస్తున్న స్వీట్ కిసెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే తను ఎంజాయ్ చేస్తున్న ఆ ఫ్రెండ్స్ ఎవరన్నది మాత్రం రహస్యంగానే ఉంచిందీ సక్కుబాయ్..