శివబాలాజీపై కోపంతో.. మధుమితకు అసభ్యకర మేసేజ్‌లు
on Oct 29, 2017

బిగ్ బాస్ తెలుగు సీజన్-1 విన్నర్, ప్రముఖ సినీనటుడు శివబాలాజీ తన భార్య మధుమిత సెల్‌ఫోన్‌కు కొంతమంది ఆగంతకులు అసభ్యకర సందేశాలు పంపుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఈ మేసేజ్‌లు వస్తున్నానయని ఆయన తెలిపారు.. ఇవి బయటకు కూడా చెప్పుకోలేనంత అసభ్యంగా ఉంటున్నాయని శివబాలాజీ ఫిర్యాదు చేశారు. అందుకు కారణాన్ని కూడా ఆయన చెప్పారు. గత కొంతకాలంగా సినిమా నటులపై యూట్యూబ్ వీడియోల్లో అశ్లీల వీడియోలు, నిరాధార ఆరోపణలు నిండిన వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు వస్తుండటం పెరిగిపోయిందని.. వాటిని తాను పలుమార్లు గట్టిగా ఖండించానని అందుకే తనపై కక్ష కట్టారని.. ఈ ఎస్ఎంఎస్‌లు పంపింది వారి మనుషులేనని ఆరోపించాడు. శివబాలాజీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



