ఆ డైరెక్టర్‌తో నయనతార పెళ్లి ఖరారు!
on Oct 28, 2017

నయనతార పెళ్లి చేసుకోబోతోందా? ప్రస్తుతం నయన ప్రేమలో ఉందా? తమిళ చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా ఇవే ప్రశ్నలు. వాటన్నింటికీ డైరెక్ట్ గా ఫొటోలతోనే సమాధానం ఇచ్చేసింది నయన. అవన్నీ నిజాలే అని చెప్పకనే చెప్పేసింది. యువదర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి ఇటీవలే విదేశీ ట్రిప్ వేసింది నయన. అక్కడ చెట్టాపట్టాలేసుకొని తిరిగి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో షాక్ అవ్వడం కోలీవుడ్ ప్రముఖుల వంతైంది. నయన ఏం చేసినా ధైర్యంగా చేసేస్తుంది. శింబూతో నయన కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. వారిద్దరి ప్రైవేటు ఫొటోలు అప్పట్లో హల్ చల్ చేశాయ్. ఆ తర్వాత ప్రభుదేవా రంగంలోకొచ్చాడు.
ప్రభుదేవాతో వ్యవహారం పెళ్లి దాకా వచ్చింది. తర్వాత ఏమైందో ఏమో.. ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు మూడో కృష్ణుడు విఘ్నేష్ శివన్. ప్రస్తుతం ఈ యువ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉందట నయన. వీరిద్దరూ కలిసి ఓ సినిమాకు పని చేశారు. ఆ సినిమా టైమ్ లోనే.. వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్. త్వరలో ఆర్య సమాజంలో ఇద్దరూ పెళ్లాడబోతున్నారట. చెన్నయ్ శివారులో ఓ లగ్జరీ విల్లా ఒకటి కొనడం కూడా జరిగిందట. ఇద్దరి కాపురం అక్కడేనట. నయన, విఘ్నేష్ ల వివాహానికి వారి కుటుంబ సభ్యులు, అంతరంగికులు మాత్రమే హాజరవుతారని టాక్. ఈ సారైనా.. నయన ఓ ఇంటి అమ్మాయి అవ్వాలని కోరుకుందాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



