పున్నాగపూల వానలో మురిసిపోయిన సింగర్ సునీత!
on Oct 7, 2022

సింగర్ సునీత ఏం చేసినా అందులో ఏదో ఒక స్పెషలిటీ కచ్చితంగా ఉంటుంది. పాట పడినా, డబ్బింగ్ చెప్పినా ఆడియన్స్ వేరే లోకంలోకి వెళ్ళిపోతారు. సింగర్స్ అందరిలోకి సునీత ఒక యూనీక్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. అంతే కాదు, సునీతకు ప్రకృతి అంటే ఇష్టం. తన ఇన్స్టాగ్రామ్ లో చూస్తే గనక అలాంటి ఫొటోస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీలు దొరికితే రకరకాల ప్రాంతాలకు వెళ్లి ఆకాశాన్ని, సముద్రాన్ని, ఇసుకను, పూలను, పక్షులను అన్నిటినీ ఆసాంతం ఎంజాయ్ చేసి వస్తుంటారు.
సునీత నేల మీద రాలిన పూలను ఏరుతున్న ఫోటో ఒకటి లేటెస్ట్‌గా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. పూలంటే సునీతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ ఒక్క ఫోటో చూస్తే చాలు.. వర్షానికి నేల మీద రాలిన పున్నాగ పూలను చాలా సంతోషంగా ఏరుతున్న సునీతను, అలాగే ఆ నీటిలో ఆమె ప్రతిబింబాన్ని తన బెస్టీ ఒకరు వీడియో తీసి బాక్గ్రౌండ్ సాంగ్ గా "సాథ్ సాథ్" చిత్రం నుంచి "తుమ్ కో దేఖా తో ఏ ఖయాల్ ఆయా" అంటూ అలనాటి మధుర గీతం పెట్టేసరికి ఆ వీడియోకి ఈ పాటకు సూపర్ గా సెట్ ఐపోయింది.
ఈ వీడియోకి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. "మీరు ప్రకృతిలా ప్రశాంతంగా ఉంటారు, పువ్వులా అందంగా ఉంటారు.. కొన్ని క్లాసిక్స్ కొంతమందికే సరిగ్గా సరిపోతాయి" అంటూ హార్ట్ టచింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



