టాలీవుడ్‌లో మరో విషాదం..యువ గాయకుడి ఆత్మహత్య
on Jun 5, 2017
.jpg)
దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన టాలీవుడ్‌కు మరో షాక్ తగిలింది. వర్థమాన గాయకుడు సుజిత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన సుజిత్ కుటుంబం గత 40 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటోంది. చిన్నప్పటి నుంచి సింగర్ అవ్వాలన్న కోరిక బలంగా ఉండటంతో ఓ ఆర్కెస్ట్రాలో సుజిత్ సింగర్‌గా వ్యవహరిస్తూ..సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరితో ఎంతో కలివిడిగా ఉండే సుజిత్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల స్థానికులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



