పవన్ తిరిగిచ్చేస్తాడు సరే... మరి మిగతా వాళ్ళూ దాసరికి న్యాయం చేస్తారా?
on Jun 3, 2017

దాసరి నారాయణ రావుని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా అభివర్ణించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకునే అయన మంచి వ్యక్తిత్వం. చిన్న సినిమాల నిర్మాతలకి బాసటగా ఉండే దాసరి, లెక్కలు పత్రాలు లేకుండా తక్కువ వడ్డీకి అప్పులిచ్చేవారంట. ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకునే వారట. అందుకే, అందరికీ ఆయనంటే అంత గౌరవం. దాసరి, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. బోయపాటి శ్రీను, డాలీ లతో కుదరకపోవడంతో, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కలిసి సినిమా చేయాల్సిందిగా కోరాడు. కొన్ని కథనాల ప్రకారం... దాసరి- పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడని తెలిసింది.
వీటికి తగ్గ అగ్రిమెంట్ డాక్యూమెంట్స్ కూడా ఉన్నాయంటున్నారు. దాసరి మృతికి సంతాపం తెలుపుతూ తమ సినిమా షూటింగ్ మూడు రోజులు ఆపేసిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తాము తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. వాస్తవానికి, వీరిరువురూ మోసం చేసే స్వభావం ఉన్న వాళ్ళు కాదు. కానీ, దాసరి అగ్రీమెంట్స్ ఏ మాత్రం లేకుండా ఇండస్ట్రీ లో ఛోటా, మోటా అని లేకుండా చాలా మందికి డబ్బులు ఇచ్చాడని అంటున్నారు. కొందరికి తన బ్యానర్ లో సినిమాలు చేసేందుకు అడ్వాన్స్ రూపంలో ఇవ్వగా, ఇంకొందరికి వేరే అవసరార్ధం ఇచ్చాడని తెలిసింది. ఇందులో ఎంత మంది తిరిగి ఇచ్చేసి తమ నిజాయితీని నిరూపించుకుంటారో... ఎందరు ఎగ్గొడతారో తెలియదు... అడిగేందుకు ఇంకా పెద్ద దిక్కు లేడు కదా... ఏదైనా జరగొచ్చు...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



