రాహుల్‌కి కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
on Aug 18, 2025
ఇటీవలి కాలంలో ఎన్నో సూపర్‌హిట్ పాటలతో అందర్నీ అలరిస్తూ ‘నాటు నాటు..’ పాటతో ఆస్కార్ వరకు వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆగస్ట్ 17న రాహుల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన ప్రేయసి హర్షిణిరెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు రాహుల్. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు రాహుల్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఎవరీ హర్షిణిరెడ్డి అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. చివరికి పూర్తి వివరాలు తెలిసాయి. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. నెల్లూరుకి చెందిన హర్షిణి... నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్న విజయ్‌కుమార్ కుమార్తె. 1985లో సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు విజయ్‌కుమార్. రాహుల్ వివాహం చేసుకోబోయే హర్షిణిరెడ్డి గురించి తెలుసుకొని ఆమెకు ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఆస్కార్ అవార్డు అందుకున్న పాటను అద్భుతంగా ఆలపించిన రాహుల్ ప్రస్తుతం సినిమా పాటలతో, మ్యూజిక్ వీడియోలతో బిజీగా ఉంటున్నాడు. త్వరలోనే వైవాహిక జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. ఆదివారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అఫీషియల్‌గా రిలీజ్ చెయ్యలేదు. కానీ, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



