చెర్రీ, యష్, ఫాహద్.. కామన్ విషయాలు ఇవే!
on Mar 30, 2023
ఇండియన్ సినిమాలో ఇప్పుడు హాట్ ప్రాపర్టీ ఎవరయ్యా అంటే ముగ్గురు పేర్లు మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. అంతగా జనాల మనసులు దోచుకున్నవారిలో ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు రామ్‌చరణ్. ఆయన్ని ఫాలో అవుతూ యష్, ఫాహద్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. తారక్, రామ్‌చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ 1250 కోట్లు కలెక్ట్ చేసింది. యష్ నటించిన కేజీయఫ్2 1200 కోట్లు కలెక్ట్ చేసింది. ఫాహద్ పాజిల్ నటించిన విక్రమ్, పుష్ప 400 కోట్లకు పైగా కలెక్ట్ అయ్యాయి.
ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని తమ పెర్ఫార్మెన్స్ లతో గొప్ప స్థాయికి తీసుకెళ్లిన నటులుగా ఈ ముగ్గురినీ గురించి నార్త్ మీడియా చెబుతోంది. ఈ ముగ్గురికీ దాదాపు ఒకటే వయసు. సినిమాల్లో ఎంట్రీ కూడా అటూ ఇటూగా ఒకే సమయంలో ఇచ్చారు.
ఇటీవల ఆస్కార్ వేడుకలో హంగామా చేసిన రామ్‌చరణ్‌ని, ఇంటర్నేషనల్ మీడియా ఇండియన్ బ్రాడ్ పిట్‌గా పొగుడుతోంది. ఇటీవల పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుపుకున్న రామ్‌చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన మూడు గెటప్పుల్లో కనిపిస్తారని టాక్. హై ఆక్టేన్ యాక్షన్ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కుతోంది గేమ్ చేంజర్. ఆ వెంటనే బుచ్చిబాబు సినిమాలో కనిపిస్తారు చెర్రీ. మధ్యలో సల్మాన్‌ఖాన్ సినిమా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌లో కనిపిస్తారు.
అటు యష్ కూడా గ్లోబల్ అప్పియరెన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. గొప్ప గొప్ప విషయాలు జరగాలంటే కాస్త సమయం పడుతుంది. అప్పటిదాకా వేచి చూడమని తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి నచ్చజెప్పారు యష్. గ్లోబల్ స్టార్‌గా ఎదిగే క్రమంలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారన్నది బెంగుళూరులో ఎకోసౌండ్‌తో వినిపిస్తున్న మాట.
ఫాహద్ ఫాజిల్ గురించి ఏం చెప్పాల్సి వచ్చినా మలయాళం టాలెంట్ పవర్‌హౌస్ అనే అంటున్నారు జనాలు. ఇప్పుడు పుష్ప2, త్వరలో విక్రమ్2లో ఫాహద్ పెర్ఫార్మెన్స్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
