వెంకీ మామ 'సైంధవ్' రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Mar 29, 2023
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం 'సైంధవ్'. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకుడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
'సైంధవ్' చిత్రాన్ని 2023, డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో వెంకటేష్ నెత్తుటి మరకలతో చేతిలో గన్ పట్టుకొని కంటైనర్ పై కూర్చొని ఉండగా, పక్కన పేలుడు పదార్థాలు ఉండటం చూస్తుంటే విధ్వంసానికి సిద్ధం అన్నట్లుగా ఉంది. గత చిత్రం 'ఎఫ్-3'తో ప్రేక్షకులను నవ్వించిన వెంకటేష్.. ఈసారి వైలెన్స్ చూపించబోతున్నారని అర్థమవుతోంది. పైగా విడుదల తేదీ ఎంపిక కూడా కలిసొచ్చేలా ఉంది. మొదటి మూడు రోజులు వీకెండ్, నాలుగో రోజు క్రిస్మస్ హాలిడే కలిసొచ్చే అవకాశముంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
