పుష్ప 2 కి అత్యధికంగా 11 నామినేషన్స్.. సరికొత్త రికార్డ్
on Jul 23, 2025

సౌత్ సినీ పరిశ్రమకి సంబంధించి ప్రతిష్టాత్మక 'సైమా అవార్డ్స్'(Siima Awards)కి ఉండే ప్రత్యేకత అందరకి తెలిసిందే. సౌత్ సినిమాలని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ అవార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. దీంతో సౌత్ సినిమా మేకర్స్, నటీనటులు ఈ అవార్డుని అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తారు. ఇప్పటి వరకు 'పన్నెండు' ఎడిషన్స్ ని పూర్తి చేసుకున్న 'సైమా' తమ 13 వ ఎడిషన్ ని దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 5 , 6 తేదీల్లో జరపనుంది.
ఈ మేరకు గత ఏడాది విడుదలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల సినిమాలకి సంబంధించి 'సైమా'కి నామినేట్ అయిన సినిమాల జాబితాని కమిటీ ప్రకటించింది. తెలుగు నుంచి అల్లు అర్జున్ వన్ మాన్ షో పుష్ప 2 (Pushpa 2) అత్యధికంగా పదకొండు నామినేషన్స్ తో టాప్ లో నిలిచింది. ప్రభాస్(Prabhas),నాగ్ అశ్విన్ ల కల్కి 2898 ఏడి(kalki 2898 ad)పది నామినేషన్స్, తేజసజ్జ, ప్రశాంత్ వర్మ 'హనుమాన్' పది నామినేషన్స్ దక్కించుకున్నాయి.
తమిళం నుంచి చూసుకుంటే అమరన్ పదమూడు నామినేషన్స్, లబ్బర్ పందు ఎనిమిది, వాళ్ళై ఏడు నామినేషన్స్ దక్కించుకున్నాయి. కన్నడ నుంచి బీమా తొమ్మిది, కృష్ణ ప్రణయ సఖి తొమ్మిది, ఇబ్బని తబ్బిడ ఇలియాలి ఏడు నామినేషన్స్, మలయాళంలో చూసుకుంటే ఆడుజీవితం పది, ఏఆర్ఏం తొమ్మిది, ఆవేశం ఎనిమిది నామినేషన్స్ ని దక్కించుకున్నాయి. మరి విజేతలుగా ఎవరు నిలుస్తారో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



