మార్గన్ ఓటిటి డేట్ ఇదే!
on Jul 23, 2025

'బిచ్చగాడు'తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న తమిళ హీరో విజయ్ ఆంథోనీ(Vijay Antony). ఆ తర్వాత విజయ్ నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా రిలీజై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే గత నెల 27 వ తేదీన 'మార్గన్'(Maargan)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. జూలై 25 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'(Amazon Prime video)ద్వారా తెలుగుతో పాటు తమిళంలోకి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఓటిటి ప్రేక్షకులకి విభిన్న కధాంశంతో కూడిన చిత్రాన్ని తిలకించే అవకాశం వచ్చినట్లయ్యింది. లియో జాన్ పాల్(Lio John Paul)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో 'మార్గన్' గా విజయ్ నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అజయ్ దిషాన్, సముద్ర ఖని. దీప్షికా, సేశ్విత రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రమ్య అనే యువతీ అత్యంత దారుణంగా హత్యకి గురవ్వుతుంది. దీంతో ఆ కేసుని ఛేదించడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. రమ్య స్నేహితుడు, మార్గన్ కూడా కేసుని పరిశోధించడం ప్రారంభిస్తాడు. ఆ పరిశోధనలో రమ్య మృతి వెనక ఉన్న కారణాలని మార్గాన్ ఎలా తెలుసుకున్నాడు.ఆ తెలుసుకునే ప్రయాణంలో 'మార్గన్' కి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు రమ్యని ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? మార్గాన్ చివరకి ఏం చేసాడు అనే పాయింట్స్ తో మార్గన్ తెరకెక్కింది. విజయ్ ఆంటోనీ నిర్మాత బాధ్యతలతో పాటు మ్యూజిక్ ని కూడా అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



