సుకుమార్ తో చేతులు కలిపిన డీజే టిల్లు!
on Feb 7, 2023
'డీజే టిల్లు' సినిమాతో ఘన విజయాన్ని అందుకొని యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 'డీజే టిల్లు' సీక్వెల్ గా రూపొందుతోన్న 'టిల్లు స్క్వేర్'తో బిజీగా ఉన్న సిద్ధు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు.
నేడు(ఫిబ్రవరి 7) సిద్ధు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఎనిమిదో సినిమా ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి వైష్ణవి దర్శకురాలు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఇప్పటికే 'విరూపాక్ష' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ఇంకా విడుదల కాకముందే ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ మరోసారి చేతులు కలపడం విశేషం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
