సహజమైన పోర్ట్ లు ఉండగా సెట్స్ వేస్తున్నారు ఎందుకు!
on Feb 7, 2023
వైజాగ్ లో అతి పెద్ద నౌకాశ్రయం ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోని అతి పెద్దదైన సహజసిద్దమైన పోర్ట్‌గా వైజాగ్ కి పేరుంది. మరో వైపు పక్కనే కాకినాడ పోర్ట్ కూడ ఉంది. ఈ రెండు లోకేషన్లు సినిమాల షూటింగ్ కు ఎంతో అనుకూలమైనవి. అందునా ఇక్కడ షూటింగ్ జరుపుకున్న చిత్రాలలో అత్యధిక శాతం చిత్రాలు విజయం సాధించాయి. అలా వీటికి మంచి సెంటిమెంట్ కూడా ఉంది. ఇక మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి వైజాగ్ నౌకాశ్రయం ఎంతగానో కలిసి వచ్చింది. గ్యాంగ్ లీడర్ నుంచి ఘరానా మొగుడు చిత్రంలోని బంగారు కోడిపెట్ట సాంగ్ లో కూడా చాలా భాగం షూటింగ్ అక్కడే జరిగింది. ఎంతో కాలంగా పలు టాలీవుడ్ సినిమాల షూటింగులు అక్కడ జరిగాయి. నిరంతరం తెలుగు సినిమాలకు ఉపయోగపడే అతి భారీ సెటప్ ఉన్న ప్రదేశాలలో ఇవి ముందుంటాయి. ఇవేకాక చిరు స్టెప్పులు అదరగొట్టిన పాటలు చాలా ఇక్కడ షూటింగ్ జరుపుకున్న చరిత్ర ఉంది.
అయితే అనూహ్యంగా వాల్తేరు వీరయ్యలోని బాస్ పార్టీ కోసం వైజాగ్ హార్బర్ ని కాదని, కనీసం కాకినాడ పోర్టు కైనా తీసుకెళ్లకుండా ఓ హార్బర్ సెట్ ని రీక్రియేట్ చేశారు. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. ఏఎస్ ప్రకాష్ హార్బర్ సెట్ ని రూపొందించారు. అయితే వైజాగ్, కాకినాడ వంటి చోట్ల పబ్లిక్ ప్రదేశాలలో షూటింగ్ జరిపితే జనాలను మేనేజ్ చేయడం అంత సులువు కాదని కథనాలు వచ్చాయి. దాంతో ప్రత్యేక సెట్ వేశారు. ఇప్పుడు చిరు బాటలోనే పుష్పా2 కూడా పోర్ట్ సెట్ నిర్మాణానికి ప్లాన్ చేస్తుంది. ఓ పాటను హార్బర్ సెట్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తోంది. అదే తరహాలో పుష్ప రాజ్ పైన ఒక దీటైన పాటను పోర్ట్ సెట్స్ లోనే చిత్రీకరణ చేయనున్నారని సమాచారం. ఈ పాట ఎంతో పవర్ ఫుల్‌గా మాసివ్‌గా ఉండనుందని సమాచారం.
ఇలా మన హీరోలు వైజాగ్ కాకినాడ నౌకాశ్రయాలను వాడుకోకుండా వాటికోసం ప్రత్యేకమైన పోర్ట్ సెట్లను వేసి అందులో షూటింగులు జరుపుకుంటున్నారు. ఒక విధంగా ఇది చాలా మంచి పద్ధతే. ఎందుకంటే పబ్లిక్ పేస్టుల్లో జనాలను మెయింటైన్ చేయడం చాలా కష్టం అంతే కాదు లీకేజీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫోటోలు, వీడియోలు లీక్ అవుతూ ఉండటంతో హీరోల లుక్ ఎలా ఉంది? పాట చిత్రీకరణ ఎలా ఉండబోతోంది? అనే లీక్లు బాగా ఇబ్బంది పెడతాయి. తన చిత్రాల అప్డేట్స్ విషయంలో ఎంతో కఠినంగా ఉండే దర్శకుడు శంకర్ ఇటీవల గోదావరి నదితీర ప్రాంతాలలో షూటింగ్ చేస్తే దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకై తెగ హల్చల్ చేశాయి. అందుకే కాస్త ఖర్చు ఎక్కువైనా సరే వీటన్నిటికీ దూరంగా సెట్లను రూపొందించి అందులో చిత్రీకరణ చేయడం వలన షూటింగ్ సాఫీగా సాగిపోతుంది. కాస్త ఖర్చుతో కూడుకున్న పని అయినా పెద్ద స్టార్స్ విషయంలో ఆ మాత్రం జాగ్రత్త తీసుకోక తప్పదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
