సైనాకు క్షమాపణలు చెప్పినా.. సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌లో కేసు!
on Jan 13, 2022

ఇటీవల చేసిన ఒక కాంట్రవర్షియల్ ట్వీట్‌తో వార్తల్లో నిలిచాడు యాక్టర్ సిద్ధార్థ్. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చేసిన ఒక ట్వీట్‌కు అతను స్పందించడంతో ఈ వివాదం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా ఉల్లంఘన ఘటనపై సైనా వ్యాఖ్యానించగా, దానిపై సిద్ధార్థ్ రెస్పాండ్ అయ్యాడు. అయితే ఈ సందర్భంగా అతను చేసిన ట్వీట్ మహిళలను అవమానపరిచేదిగా ఉందనీ, 'కాక్' లాంటి అసభ్య పదాలను ఉపయోగించాడనీ అతడిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. అతడి అకౌంట్‌ను బ్లాక్ చేయమని ట్విట్టర్‌ను కోరుతూ నెటిజన్లు ట్రెండింగ్ ప్రారంభించారు. నిన్న సైనా నెహ్వాల్‌కు ట్విట్టర్ వేదికగా బహిరంగ క్షమాపణలు కోరాడు సిద్ధార్థ్. అయినప్పటికీ, హైదరాబాద్‌లో అతనిపై ఓ కేసు నమోదయ్యింది.
Also read: సైనా నెహ్వాల్ కు బహిరంగ క్షమాపణ చెప్పిన సిద్ధార్థ్!
లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం, సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌పై హైదరాబాద్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని సైబర్‌క్రైమ్ విభాగంలో ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదయ్యింది. పీటీఐ వార్తా సంస్థ తెలిపిన దాని ప్రకారం, ఐపీసీ సెక్షన్ 509 కింద (మహిళల గౌరవాన్ని కించపరిచేందుకు ఉద్దేశించే పదం, సంజ్ఞ ఉపయోగించడం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఒక సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు.
Also read: ఇంకో జన్మలోనైనా నువ్వే నా అన్నయ్యవి.. మహేశ్ తీవ్ర భావోద్వేగం!
దీంతో ఈ కాంట్రవర్సీ సిద్ధార్థ్ చేతులు దాటిపోయినట్లు కనిపిస్తోంది. తన క్షమాపణల ట్వీట్‌లో, సైనా నెహ్వాల్‌ను అగౌరవ పరిచే ఉద్దేశంతో ఆ ట్వీట్ చేయలేదని, తాను కరడుగట్టిన ఫెమినిస్టుననీ అతను తెలిపాడు. తన ట్వీట్‌లో ఒక మహిళగా ఆమెపై దాడిచేసే ఉద్దేశం తనకు లేదనీ, దీన్ని ఇంతటితో వదిలేద్దామనీ, తన లెటర్‌ను అంగీకరించమనీ సైనాను కోరాడు సిద్ధార్థ్. చివరలో "నువ్వెప్పటికీ నా ఛాంపియన్‌వి" అని కూడా రాశాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



