'ఉప్పెన' హీరో సాలిడ్ లైనప్.. ప్రముఖ బ్యానర్స్ లో సినిమాలు
on Jan 13, 2022

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'కొండపోలం' సినిమాతోనూ మెప్పించిన వైష్ణవ్.. ప్రముఖ నిర్మాణ సంస్థలతో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. ఈరోజు(జనవరి 13) వైష్ణవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమా చేస్తున్నాడు. 'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ గా తెరకెక్కిన 'ఆదిత్య వర్మ' డైరెక్టర్ గిరీశయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వైష్ణవ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'రంగ రంగ వైభవంగా', 'ఆబాల గోపాలం' అనే టైటిల్స్ ఒక దాన్ని ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
వైష్ణవ్ మరో మూవీకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. వైష్ణవ్ పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అందులో తమ ప్రొడక్షన్ లో 16వ సినిమాను వైష్ణవ్ హీరోగా, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నిర్మించబోతున్నట్టుగా తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



