యాపిల్ సిఈఓ టిమ్ కుక్ దగ్గరకి సిద్దార్ధ్, అదితి లు ఎందుకు వెళ్లారు
on Sep 10, 2024

తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేర్లు బొమ్మరిల్లు సిద్దార్ద్(siddharth)అదితిరావు హైదరి(aditirao hydari)త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ మేరకు కొన్నినెలల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ జంట రీసెంట్ గా యుఎస్ లోని కాలిఫోర్నియా నగరానికి వెళ్ళింది. వెళ్లడమే కాదు ఒక అరుదైన ఘనతని కూడా అందుకుంది.
వరల్డ్ లోనే ప్రసిద్ధ టెక్ కంపెనీగా ప్రసిద్ధి కెక్కిన యాపిల్(apple)సంస్థ కాలిఫోర్నియాలో గ్లో టైమ్ అనే ఒక ఈవెంట్ ని నిర్వహించింది.ఈ ఈవెంట్ కి సిద్దార్ధ్, అదితి లు హాజరయ్యారు. అంతే కాకుండా యాపిల్ సిఈఓ టీం కుక్ ని కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత టీం కుక్(tim cook)తో కలిసి కొన్ని ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో పాటుగా ఒక పోస్ట్ ని కూడా పొందుపరిచారు.
ఆ ఈవెంట్ ని మా లైఫ్ లో యాపిల్ ఎప్పటికి మర్చిపోలేం.అత్యంత పెద్ద సాంకేతిక ప్రపంచంలో రెండు రోజుల పాటు ఎంజాయ్ చేస్తు ఉన్నాం. అదే విధంగా యాపిల్ సిబ్బంది ప్రేమ మా మనసులని హత్తుకుంది.పైగా వాళ్ళ ప్రతిభ, ఆవిష్కరణలకి ఆశ్చర్యపోయాం. అలాగే అలాంటి వ్యక్తులని కలిసినందుకు మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి,ముఖ్యంగా టిమ్ కుక్ ఎంతో వినయంగా పలకరించారంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.ఇక ఈ ఈవెంట్ లో సుప్రసిద్ధ ప్రముఖులతో పాటు ఇండియన్ సినీ సీమకి చెందిన పలువురు నటులు, నటీమణులు కూడా పాల్గొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



