'దేవర' ట్రైలర్.. కొరటాల ఇలా చేస్తాడనుకోలేదు!
on Sep 10, 2024

నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'దేవర' (Devara). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకుని.. సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్ వచ్చింది. (Devara Trailer)
తాజాగా దేవర ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. సముద్రతీర ప్రాంతంలో ధైర్యం తప్ప ఏమీ తెలియని మనుషులకు భయాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా దేవర పాత్రను పరిచయం చేశారు. దేవర ఎంత ధైర్యవంతుడో, అతని కుమారుడు వర అంత పిరికివాడిగా కనిపిస్తున్నాడు. పిరికివాడైన వర.. తన తండ్రిలా ధైర్యవంతుడిలా మారి ఎలా తిరగబడ్డాడు అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. అలాగే మిత్రులైన దేవర, భైర (సైఫ్ అలీ ఖాన్) శత్రువులుగా ఎలా మారారు? అసలు దేవరకి ఏమైంది? అతను కనిపించకుండా పోవడానికి కారణమేంటి? సముద్రంలో అతని వేట ఎవరికోసం? వంటి ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ ను అద్భుతంగా రూపొందించారు. టెక్నికల్ గానూ ట్రైలర్ ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచాయి. ఇక ట్రైలర్ చివరిలో సముద్రంలో సొరచేపతో ఎన్టీఆర్ తలపడే షాట్ అదిరిపోయింది. అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, కట్టిపడేసే ఎమోషన్స్ తో దేవర చిత్రాన్ని రూపొందించారని ట్రైలర్ తో అర్థమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



