విడాకుల తర్వాత ఏం జరిగిందో శృతిహాసన్ చెప్పేసింది
on Apr 26, 2025
.webp)
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan)కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతిహాసన్(Shruti Haasan)అనేక హిట్ చిత్రాల్లో నటించి గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు. ఇందుకు ఆమె నటించిన చిత్రాలే ఉదాహరణ. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్(Rajini Kanth) మరో సూపర్ స్టార్ నాగార్జున(Nagarjuna)కాంబోలో తెరకెక్కుతున్న 'కూలి'(Coolie)లో చేస్తుంది. రీసెంట్ గా శృతి హాసన్ ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది.
ఆమె మాట్లాడుతు నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నా లైఫ్ లో ఏం జరిగిందో ఎవరకి తెలియదు. అమ్మ,నాన్న నా చిన్నతనంలోనే విడాకులు తీసుకోవడంతో అమ్మతో కలిసి చెన్నై నుంచి ముంబై కి వచ్చేసాను చెన్నైలో ఉన్నప్పుడు మెర్సిడెజ్ బెంజ్ కారులో తిరిగిన నేను, ముంబై లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించాను. ఆ విధంగా చిన్నతనంలోనే రెండు రకాల జీవితాలు చూసాను. ఇండస్ట్రీకి వచ్చాక నాన్నతోనే ఎక్కువగా ఉంటు నాకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాను. స్వతంత్రంగా, ఆత్మ విశ్వాసంతో లైఫ్ ని కొనసాగిస్తున్నాను. విదేశాల్లో సంగీతం కూడా నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.
కమల్ హాసన్, సారిక(sarika)లకి ఇద్దరు అమ్మాయిలు కాగా వాళ్లలో పెద్ద కూతురు శృతి హాసన్. రెండవ అమ్మాయి అక్షర హాసన్. అక్షర కూడా సినిమాల్లో చేస్తు తనదైన స్టైల్లో ముందుకు దూసుకుపోతుంది. కమల్, సారిక కి 1988 లో వివాహం జరగగా 2004 లో విడిపోయారు. కమల్ కి సారిక రెండవ భార్య కాగా సారిక నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసారు. ఆమె అసలు పేరు సారిక ఠాకూర్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



