ఓజి లోని క్యారక్టర్ పై శ్రియా రెడ్డి వ్యాఖ్యలు ఇవేనా!..
on Sep 3, 2025

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ప్రీవియస్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)ఆశించినంత విజయాన్ని అందుకోకపోవడంతో, అభిమానుల ఆశలన్నీ 'ఓజి'(og)పైనే ఉన్నాయి. ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల సిద్ధమవుతుండగా, 'ఓజి' తో బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ తన స్టామినాని మరోసారి చాటి చెప్తాడనే నమ్మకం కూడా వాళ్ళల్లో ఉంది. ప్రచార చిత్రాలతో పాటు, ఇప్పటి వరకు రిలీజైన సాంగ్స్ కూడా 'ఓజి 'పై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగిస్తున్నాయి.
ఓ జి లో పవన్ సరసన 'ప్రియాంక మోహన్'(Priyanka MOhan)జత కడుతుండగా, వర్సటైల్ నటి ''శ్రియా రెడ్డి'(Sriya Reddy)కీలక పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఆమె రోల్ గురించి మేకర్స్ ఇంకా బయటకి చెప్పలేదు. కానీ రీసెంట్ గా 'శ్రియా రెడ్డి ఓజి లోని తన క్యారక్టర్ గురించి మాట్లాడుతు 'ఓజీ’లో నా క్యారక్టర్ రియలిస్టిక్ కి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారక్టర్ కూడాను తద్వారా మరో సారి విభిన్నమైన నటనని ప్రదర్శించే అవకాశం వచ్చింది. హై యాక్షన్‌తో పాటు మంచి మెలోడి డ్రామా కూడా ఉండటంతో, ఖచ్చితంగా ఓజి ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉంటుందని శ్రీయ రెడ్డి చెప్పుకొచ్చింది. ప్రభాస్ ప్రీవియస్ మూవీ 'సలార్' లో 'రాధా రమ' క్యారక్టర్ ద్వారా 'శ్రియా రెడ్డి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఓజి లో 'జ్యోతి గంభీర' అనే క్యారక్టర్ లో కనిపిస్తుంది. పవన్ 'ఓజాస్ గంభీర' గా కనిపిస్తున్నాడు
దీంతో 'శ్రియా రెడ్డి చెప్పిన మాటల ద్వారా 'ఓజి' లోని ఆమె క్యారక్టర్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది. పాజిటివ్ రోల్ అయినా నెగిటివ్ రోల్ లో అయినా, 'శ్రియా రెడ్డి తన నట విశ్వరూపాన్ని ప్రదరిస్తుంది. పొగరు, కాంచీవరం, సమ్ టైమ్స్ వంటి చిత్రాల్లోని నటనే అందుకు ఉదాహరణ. ఇక 'ఓజి' రిలీజ్ కి ముందే అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుంది. ఓవర్ సీస్ లో ఇప్పటికే పవన్ కెరీర్ లోనే హయ్యస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ని సాధించిన మూవీగా నిలిచింది. ఇటీవల ఒక అభిమాని ఐదు లక్షల రూపాయలకి ఓజి టికెట్ కొనడం కూడా జరిగింది.దీన్ని బట్టి 'ఓజి' క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. డివివి దానయ్య(Dvv Danayya)దాసరి కళ్యాణ్(Dasari Kalyan)తమ గత చిత్రాలకి ఏ మాత్రం తీసిపోని విధంగా, భారీ వ్యయంతో నిర్మించారు. సుజిత్(Sujeeth)దర్శకుడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



