యస్... 'ఆర్ఆర్ఆర్'లో ఆమెది అతిథి పాత్రే
on Feb 13, 2020

'ఆర్ఆర్ఆర్'లో అజయ్ దేవగణ్ సరసన శ్రియ నటిస్తున్నదని తెలుగువన్ ముందే చెప్పింది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి పెదవి విప్పని శ్రియ, ప్రేమికులరోజు సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తొలిసారి మాట్లాడింది. "అవును... 'ఆర్ఆర్ఆర్'లో నేను అతిథి పాత్రలో కనిపిస్తా. రాజమౌళి సార్ సెట్‌లో ఉండడం నాకు ఎంతో ఇష్టం. 'ఛత్రపతి' చిత్రీకరణలో నాకు ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. నిజాయతీగా చెబుతున్నా... రాజమౌళి సినిమాలో పని చేస్తే, అసలు పని చేస్తున్నట్టే ఉండదు. అసిస్టెంట్ దర్శకులు, కెమెరామెన్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎంతో సరదాగా ఉంటుంది. మనం ఎవరితోనైనా మాట్లాడవచ్చు. మనకు ఎంత అలసటగా అనిపించినా... పని చేసినట్టు మాత్రం ఉండదు" అని శ్రియ పేర్కొంది. వికారాబాద్ అడవుల్లో అజయ్, శ్రియపై రాజమౌళి కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



