శిల్పాశెట్టి హోటల్ మూసివేత.. పార్టీ ఇస్తున్న ప్రముఖ హీరోయిన్
on Sep 3, 2025

ప్రముఖ హీరోయిన్ 'శిల్పాశెట్టి'(Shilpa shetty)సుదీర్ఘ కాలం నుంచి భారతీయ సినీ ప్రేక్షకులకి సుపరిచిస్థురాలు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలకి చెందిన పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలని పోషిస్తు వస్తుంది. రేపు కన్నడ చిత్రం 'కేడి ది డెవిల్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా తో కలిసి 2016 లో 'బాస్టియన్' అనే రెస్టారెంట్ ని ముంబై లోని బాంద్రా(Bandra)ఏరియాలో ఏర్పాటు చేసింది. ముంబై(Mumbai)నగర వ్యాప్తంగా ఇతర ఏరియాల్లో పలు బ్రాంచ్ లు కూడా ఉన్నాయి.
రీసెంట్ గా 'శిల్పాశెట్టి' సోషల్ మీడియా వేదికగా 'బాస్టియన్'(Bastian)రెస్టారెంట్స్ పై స్పందిస్తు 'బాంద్రా ఏరియాలో ఉన్న 'బాస్టియన్' ని గురువారం మూసివేస్తున్నాం. ఎంతో ఆదరణ సొంతం చేసుకోవడంతో పాటు, మాకెన్నో జ్ఞాపకాలని అందించింది. చివరిసారిగా బాస్టియన్ లో గురవారం వేడుక నిర్వహిస్తున్నాం. కుటుంబసభ్యులు,సన్నిహితులు, వ్యాపార భాగస్వామ్యులు, ఈ వేడుకకి హాజరు కానున్నారు. త్వరలో మరో కొత్త అనుభవంతో మీ ముందుకు వస్తానని తెలుపుతు పోస్ట్ చేసింది. సీ ఫుడ్ కి బాస్టియన్ ఫేమస్.
ఇటీవల శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా పై పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి 60 కోట్ల రూపాయలు మోసం చేసారని పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'బాస్టియన్'
మూసి వేత ప్రాధాన్యత సంతరించుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



