శర్వానంద్‌కి సర్జరీ... ఎక్కడంటే...
on Mar 14, 2020

'జాను' సినిమా కోసం స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా హీరో శర్వానంద్ కు చిన్న యాక్సిడెంట్ జరిగింది. భుజం దగ్గర ఆయనకు గాయమైంది. అప్పుడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. అయితే... చేతి నిండగా సినిమాలు ఉండటంతో వైద్యులు సర్జరీ చేయించుకోమని చెప్పినా చేయించుకోవడానికి ఆయనకు వీలు పడలేదు. 'జాను' విడుదల తర్వాత శర్వానంద్ అమెరికా వెళ్లారు. అక్కడే అనుభవజ్ఞులైన వైద్యులు బృందం సమక్షంలో సర్జరీ చేయించుకున్నారు. రెండు మూడు రోజుల క్రితం ఆయనకు సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వారంలో ఇండియాకి తిరిగి వస్తాడట. మరికొన్ని వివరాలు అతని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని సమాచారం. నిజానికి, 'శ్రీకారం' షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్జరీ చేయించుకోవాలని శర్వానంద్ అనుకున్నాడట. 'జాను' పరాజయం పాలవడంతో వెంటనే అమెరికా వెళ్లారు. మరో వైపు కరోనా వైరస్ కారణంగా సినిమాలు వాయిదా పడుతుండటంతో అర్జంటుగా 'శ్రీకారం' కంప్లీట్ చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. ఏప్రిల్ నుండి మళ్లీ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ ఎండింగ్ లేదా రెయినీ సీజన్ స్టార్టింగ్ లో విడుదల చేయాలనుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



