అట్లీ డైరెక్షన్‌లో షారుఖ్ డబుల్ రోల్!
on Sep 23, 2020

2018 డిసెంబర్‌లో 'జీరో' మూవీ రిలీజయ్యాక షారుఖ్‌ఖాన్ నటన నుంచి విరామం తీసుకొని స్క్రిప్టులు వింటూ, తెరపై తనను ఎలా ఆవిష్కరించుకోవాలో ఆలోచించుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాడు. ఇప్పటివరకూ అఫిషయల్ అనౌన్స్‌మెంట్స్ ఏవీ లేకున్నా, మూడు సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వాటిలో ఒకటి 'పఠాన్' మూవీ. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాల తర్వాత మరోసారి దీపికా పడుకోనేతో ఈ సినిమాలో ఆయన నటించనున్నాడు.
మరో సినిమా రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్షన్‌లో నటించనున్న సోషల్ కామెడీ కాగా, ఇంకొకటి తమిళ డైరెక్టర్ అట్లీతో చేయనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్. అట్లీ డైరెక్ట్ చేసే సినిమాలో షారుఖ్ డబుల్ రోల్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. రెండేళ్లుగా ఆ ప్రాజెక్ట్‌పై ఆ ఇద్దరూ చర్చించుకుంటూ వస్తున్నారు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా రెండు క్యారెక్టర్లను షారుఖ్ చేయనున్నాడు. కథంతా ఈ రెండు క్యారెక్టర్ల చుట్టూ, వాళ్ల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ నడుస్తుంది. విజయ్‌తో చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'బిగిల్' తర్వాత అట్లీ డైరెక్ట్ చేసే సినిమా ఇదే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



