తెలుగునాట రజినీకాంత్ తర్వాత షారూఖ్ ఖానే!
on Sep 18, 2023
ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక తన రీసెంట్ మూవీ 'జవాన్'తో ఆ జోరుని కొనసాగిస్తున్నారు. 'పఠాన్' వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టగా, 'జవాన్' ఇప్పటికే రూ.800 కోట్ల గ్రాస్ రాబట్టి వెయ్యి కోట్ల దిశగా పయనిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా 'జవాన్' దూకుడు చూపిస్తోంది. తాజాగా ఇక్కడ రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఈ ఏడాది 'పఠాన్'తో తెలుగునాట మొదటిసారి రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన షారూఖ్, ఇప్పుడు 'జవాన్'తో బ్యాక్ టు బ్యాక్ ఆ ఫీట్ సాధించారు. దీంతో ఇతర భాషలకు చెందిన హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తెలుగునాట అత్యధిక రూ.50 కోట్ల సినిమాలున్న హీరోగా షారూఖ్ నిలిచారు.
నాన్-తెలుగు మూవీస్ లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ పరంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా రజినీకాంత్ నటించిన 'రోబో'(2010) నిలిచింది. ఆ తర్వాత '2.O', 'జైలర్' చిత్రాలతో ఈ ఫీట్ మళ్ళీ సాధించారు రజినీ. దీంతో ఆయన ఖాతాలో తెలుగునాట 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు మూడు ఉన్నాయి. రెండు సినిమాలతో(పఠాన్, జవాన్) ఆ తర్వాతి స్థానంలో షారుఖ్ ఉన్నారు. ఈ ఐదు సినిమాలు కాకుండా.. 'ఐ', 'కేజీఎఫ్-2', 'కాంతారా', 'అవతార్-2' కూడా తెలుగునాట రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేశాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
