ఇద్దరు స్టార్స్‌తో రూ.1500 కోట్లు టార్గెట్ చేసిన అట్లీ
on Sep 18, 2023
సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న డైరెక్టర్స్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో అదరగొట్టే సినిమాలను చేస్తున్నారు. ఆ కోవలో స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా జాయిన్ అయ్యారు. ఆయన తెరకెక్కించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ 11 రోజుల్లో రూ.858 కోట్ల వసూళ్లను సాధించింది. త్వరలోనే వెయ్యి కోట్ల మార్కును సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్లు వసూళ్లను సాధించిన సినిమాల్లో హీరోగా నటించిన ఘనత షారూఖ్ ఖాన్‌కే దక్కుతుందని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. డైరెక్టర్ అట్లీపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అట్లీ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైర్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఎలాంటి కామెంట్స్ చేశారనే వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ బాద్ షా షారూఖ్, దళపతి విజయ్ కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడు చేయబోతున్నారంటూ బాలీవుడ్ మీడియా ప్రశ్నించిన దానికి అట్లీ ఏమాత్రం తడుముకోకుండా కచ్చితంగా ఇద్దరితో కలిసి సినిమా తీస్తాను. వారిద్దరికీ సరిపోయే కథను భవిష్యత్తులో నేనే రాస్తాను అని అట్లీ అన్నారు. అంతే కాకుండా తన కెరీర్‌లో గొప్ప సినిమాలను ఇచ్చిన క్రెడిట్ వారిద్దరికే దక్కతుఉందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా వారిద్దరూ కలిస్తే రూ.1500 కోట్లను మించి వసూళ్లు వస్తాయని ఈ సందర్భంగా అట్లీ పేర్కొనటం విశేషం.
నిజానికి జవాన్ మూవీలోనే దళపతి విజయ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలన్నీ అవాస్తవాలని రిలీజ్ తర్వాత తెలిసింది. జవాన్‌లో షారూఖ్ ఖాన్ ద్విపాత్రాభియం చేశారు. దీపికా పదుకొనె, నయనతార హీరోయిన్స్‌గా నటించగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించి మెప్పించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
