'సెంబి' మూవీ రివ్యూ
on Feb 5, 2023
సినిమా పేరు: సెంబి
తారాగణం: కోవై సరళ, అశ్విన్ కుమార్, లక్ష్మీకాంతన్, తంబి రామయ్య, బేబి నిలా, నాజిల్ సంపత్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎం. జీవన్
ఎడిటింగ్: బువన్
సంగీతం: నివాస్ కె. ప్రసన్న
కథ, దర్శకత్వం: ప్రభు సాలమన్.
ప్రొడ్యూసర్స్: ఆర్. రవీంద్రన్, అజ్మల్ ఖాన్, రేయా
బ్యానర్స్: ట్రైడెంట్ ఆర్ట్స్, ఏఆర్ ఎంటర్‌టైన్మెంట్
ఓటీటీ: డిస్నీ+ హాట్ స్టార్
కథ:
అరకులోని ఒక కొండ మీద చిన్న గుడిసెలో పదేళ్ళ అమ్మాయి సెంబి(బేబి నిలా), వాళ్ళ అమ్మమ్మ వీరతల్లి(కోవై సరళ)తో కలిసి ఉంటుంది. వీళ్ళు అడవిలో దొరికే పండ్లు, తేనే అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. సింబి ఒక రోజు తేనె తీసుకెళ్తుండగా.. కొంతమంది ఆగంతకులు ఆమెను రేప్ చేస్తారు. ఆ రేప్ చేసింది ఎవరు? సింబి అమ్మమ్మ వీరతల్లి వాళ్ళకి శిక్ష పడేలా చేసిందా? తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
సమాజంలో పెరిగిపోతున్న అత్యాచారాలను ఆధారంగా చేసుకొని ఆ తరహా సినిమాలు మనం ఇప్పటికి చాలానే చూశాం. కానీ ఈ సినిమాని తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంది. ఒక గిరిజన పాపపై జరిగిన రేప్ గురించి న్యాయం చేయకుండా మొదట పోలీసులు డబ్బు కోసం వదిలేస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు తమ పదవుల కోసం ఆ పాపకి న్యాయం జరగాలంటూ నటించే సీన్స్.. ఇక బస్సులో వెళ్తున్నప్పుడు పాసింజర్స్ లో ఒక అతను అసలు విషయం తెలియకుండా తప్పుగా ప్రొజెక్ట్ చేసే విధానం ఇలా అన్నీ కూడా సమాజంలో మనుషుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. ఇలాంటి విషయాల్ని చూసి చూడనట్టుగా వదిలేస్తారు అన్నట్టుగా ఉంటుంది.
బస్సు లో వెళ్తున్నప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎక్కి సోదా చేస్తుండగా కండక్టర్ స్మార్ట్ ఫోన్ లేదా అని అడిగేసరికి.. మూడు స్మార్ట్ ఫోన్లు ఉండేవి కానీ దొంగలు కొట్టేశారు అంటూ ఆ కానిస్టేబుల్ చెప్పడంతో.. పోలీసులకే రక్షణ లేదు ఇక వీళ్ళు సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఎలా కల్పిస్తారు అన్న పాయింట్ బాగుంటుంది.
ఒంటరి గిరిజన మహిళలకే కాదు.. చిన్నపిల్లలకు అన్యాయం జరిగితే ఎవరూ పట్టించుకోరు అనే సెన్సిటివ్ మ్యాటర్ ని చాలా బాగా చిత్రీకరించారు. అత్యాచారం జరిగిన తర్వాత ప్రజల ఆలోచనా విధానం ఎలా ఉంటుందని ఎలా వాళ్ళు చూస్తారో అద్భుతంగా చూపించారు. ప్రజలు ఐకమత్యంతో ఉంటే వారికి వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించుకోవచ్చో చెప్పారు. లాయర్లకే కాకుండా ప్రజలకు కూడా చట్టాల గురించి తెలిస్తే తమని తాము కాపోడుకోవచ్చనేది ఇందులో చూపించారు. ఇక పోలీస్ వ్యవస్థ గురించి, న్యాయ వ్యవస్థ గురించి ప్రజలకు ఉన్న అవగాహనను చక్కగా ప్రొజెక్ట్ చేశాడు డైరెక్టర్.
కొన్ని సీన్స్ లో అరకు అందాలను, కొండలను బస్సు లో నుండి చూపించే సీన్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఎం. జీవన్ సినిమాటోగ్రఫీ అబ్బురపరుస్తుంది. నివాస్ కె. ప్రసన్న అందించిన సంగీతం పర్వాలేదనిపించింది. బువన్ కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ఒకప్పుడు లేడీ కమెడియన్ గా తన మార్క్ ని చాటుకున్న కోవై సరళ.. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నటించిన సినిమా ఇది. ఇందులో ఒక వృద్దురాలిగా డీగ్లామర్ రోల్ ని చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తన మనుమరాలి కోసం ఎంతవరకైనా పోరాడే సీన్స్ లో పవర్ ఫుల్ ఉమెన్ గా ఆకట్టుకుంది. సెంబిగా చేసిన బేబి నిలా తన యాక్టింగ్ తో అబ్బురపరిచింది. ఒక పదేళ్ళ అమ్మాయి రేప్ కి గురైనప్పుడు ఏం తెలియని అమయాకురాలిగా బాగా చేసింది. లాయర్ పాత్రలో అశ్విన్ కుమార్ బాగానే చేశాడు. మిగతావాళ్ళంత ఉన్నంతలో పర్వాలేదనిపించారు.
తెలుగువన్ పర్సెపెక్టివ్:
మంచి స్టోరీ లైన్ తో ఎంటర్‌టైన్మెంట్ తో పాటు ఒక సీరియస్ మూవీని ఓటీటీలో చూడాలనేకువారు ఈ సినిమాని చూడొచ్చు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో.. మధ్యలో కాస్త స్లో సీన్స్ వదిలిస్తే సినిమా మొత్తం అల్టిమేట్.
రేటింగ్: 3/5
-దాసరి మల్లేశ్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
