ఆ భామకు బ్యాడ్ బాయ్స్ ఇష్టమట..!
on May 12, 2016

హాలీవుడ్ పాప్ సెన్సేషన్ సెలెనా గోమెజ్ కు బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టమట. నీట్ గా పక్కపాపిడి తీసి, అందంగా టక్ చేసుకునే పద్ధతైన కుర్రాళ్ల కంటే, పక్కా బ్యాడీలతో అఫైర్ నడపడమే తనకు ఇష్టమని ఖచ్చితంగా చెబుతోంది. ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సెలెనా ఈ విషయాలు వెల్లడించింది. నిన్న మొన్నటి వరకూ తోటి పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగి తేలిన ఈ భామకు రీసెంట్ గా అతనితో బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిన తర్వాత బీబర్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందా అన్న ప్రశ్న ఇప్పుడామె ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అమీ స్కూమర్, జెన్నిఫర్ లారెన్స్ లాంటి వాళ్లంటే తనకు చాలా ఇష్టమని, వాళ్లందరూ మహిళలంటే బలవంతులు అనే ఫీలింగ్ ను కల్పిస్తుంటారని చెబుతోంది. ఓ పక్క తన మాజీ బాయ్ ఫ్రెండ్ బీబర్ హాయిగా కొత్త గర్ల్ ఫ్రెండ్ ను తగులుకుని ఎంజాయ్ చేస్తుంటే, సెలెనా ఇంకా బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కునే పనిలో ఉంది. త్వరలోనే సెలెనా టేస్ట్ కు తగ్గ బ్యాడ్ బాయ్ ఫ్రెండ్ దొరకాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



