రెహమాన్ ని కాదని డీఎస్పీకి ఓటేసిన శేఖర్ కమ్ముల!
on Sep 22, 2023
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రష్మికా మందన్న హీరోయిన్ కాగా, కీలక పాత్రలో కింగ్ నాగార్జున సందడి చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల మొదటిసారి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ కెరీర్ లో 51వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ కి మొదట సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని అనుకున్నారు. కానీ ఏవో కారణాల ఆయనను కాదని దేవి శ్రీ ప్రసాద్ కి ఓటేశారట కమ్ముల. అదే నిజమైతే డీఎస్పీ-కమ్ముల కలయికలో ఇదే మొదటి సినిమా అవుతుంది.
శేఖర్ కమ్ముల ఇప్పటిదాకా రాధాకృష్ణన్, మిక్కీ జె. మేయర్, శక్తికాంత్ కార్తీక్, పవన్ సిహెచ్ వంటి సంగీత దర్శకులతో పనిచేశారు. ఆయన సినిమాలకు సంగీతం ఎవరు అందించినా సాంగ్స్ అదిరిపోతాయి. కమ్ముల మ్యూజిక్ టేస్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది. అందుకే ఆయన సినిమాల్లోని సంగీతానికి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. అలాంటి కమ్ముల సినిమాకి మొదటిసారి డీఎస్పీ సంగీతం అందించబోతున్నారు. మరి ఈ కాంబో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
