సూర్య, బోయపాటి కాంబినేషన్‌లో హై ఓల్టేజ్ మూవీ!
on Sep 22, 2023
టాలీవుడ్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. హీరోయిజాని చూపించడంలో, యాక్షన్ సీక్వెన్స్‌లను భారీగా తెరకెక్కించడంలో బోయపాటి స్పెషల్ కేర్ తీసుకుంటూ సంచలన విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. ఇక కోలీవుడ్ హీరోల్లో సూర్యకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అతను ఎంపిక చేసుకునే సినిమాలు, అతను చేసే క్యారెక్టర్స్ పూర్తి భిన్నంగా ఉంటాయి. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండాలని కోరుకునే సూర్య ఆ తరహా సినిమాలే చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నాడు.
ఇలాంటి ఒక హీరో, డైరెక్టర్ కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా ఒక సెన్సేషనే అవుతుంది. ఇప్పుడు అలాంటి సెన్సేషనల్ మూవీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతోంది. సూర్య హీరోగా సినిమా చెయ్యాలని వుందని గతంలోనూ బోయపాటి చెప్పారు. వీరిద్దరూ కలిసి చేయబోయే సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నారు. బోయపాటి చేసే సినిమాలు ఎంత గ్రాండ్‌గా ఉంటాయో తెలిసిందే. ఈ సినిమా కూడా హై ఓల్టేజ్ మూవీగా తెరకెక్కుతుందట. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మించనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.
సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే సినిమా చేస్తున్నాడు. 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 10 భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే భారీ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక రామ్ హీరోగా బోయపాటి శ్రీను చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్కంధ’. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
