మహేశ్ బర్త్‌డే స్పెషల్: 'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్
on Aug 9, 2020

ఆగస్ట్ 9 అంటే సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్‌కు పండగ రోజు.. కారణం అది ఆయన బర్త్‌డే. ఆ రోజు వాళ్లు భారీ కేక్‌లు కట్ చేసి, రక్తదానాలు చేసి, సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొని మహేశ్‌పై తమ అభిమానాన్ని చాటుకొనే రోజు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి కోరలు చాచి విజృంభిస్తుండటంతో ఆ యాక్టివిటీస్‌కు దూరంగా ఉండాల్సిందిగా మహేశ్ తన అభిమానులను కోరాడు. అయితే కరోనాతో బాధపడుతున్న వారిని కాపాడటం కోసం ప్లాస్మా డొనేషన్‌పై ప్రజల్లో అవగాహన కలిగించాల్సిందిగా వారిని కోరాడు.
దాంతో పాటు తన ఫ్యాన్స్‌ను ఆనందింపజేయడం కోసం తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఒక అప్‌డేట్ ఇచ్చాడు మహేశ్. ఆయన పరశురామ్ డైరెక్షన్‌లో 'సర్కారు వారి పాట' చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తన బర్త్‌డే సందర్భంగా ఆదివారం ఉదయం 9:09 గంటలకు టైటిల్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించాడు మహేశ్.
తమన్ బీజియం అదరగొడుతుండగా మహేశ్ చేయి ఒక రూపాయి కాయిన్‌ను పైగెరవేయగా, 'సర్కారు వారి పాట' అంటూ లేడీ వాయిస్ ట్రాక్ పాడుతుండగా టైటిల్ ప్రత్యక్షమైంది. "హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు" అంటూ ఇంగ్లీషులో అక్షరాలు పడ్డాయి. నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకపోయినా మోషన్ పోస్టర్‌తో సూపర్‌స్టార్ తమకు ఆనందం చేకూర్చాడని ఆయన ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



