'కళావతి' సాంగ్ లీక్.. 'సర్కారు వారి పాట' మేకర్స్ ఫైర్!
on Feb 12, 2022

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళావతి'ని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 న విడుదల చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే సాంగ్ ఇంకా అధికారికంగా విడుదల కాకముందే లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'సర్కారు వారి పాట' ఫస్ట్ సింగిల్ 'కళావతి' సాంగ్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ ప్రోమోని శుక్రవారం విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్ వ్యూస్, లైక్స్ తో సాంగ్ ప్రోమో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 14 న పూర్తి సాంగ్ విడుదలైతే ఇంతకు మించిన రెస్పాన్స్ వస్తుందని భావించారంతా. అయితే ఊహించని విధంగా ఈ సాంగ్ రెండు రోజుల ముందే నెట్ దర్శనమిచ్చింది. సాంగ్ లీక్ కావడంపై మేకర్స్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు మహేష్ ఫ్యాన్స్ కూడా ఇలా సాంగ్ లీక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం సాంగ్ బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'సర్కారు వారి పాట' మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు మహేష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



