పవన్ మళ్లీ బిజి ..పొలిటిక్స్‌లోనా?సినిమాల్లోనా?
on Apr 16, 2016

సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్‌తో దెబ్బతిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్యూచర్‌పై ఫోకస్ చేశారు. 2019 నాటికి రాజకీయాల్లో దిగాలనుకుంటున్న పవన్ వీలైనంత త్వరగా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాల కథ విన్న కళ్యాణ్..వాటిని ఫైనల్ చేయనున్నాడు. మైత్రీ మూవీస్, 14 రీల్స్, పీవీపీ లాంటి భారీ సంస్థలు క్యూలో ఉన్నా తన స్నేహితులకు సినిమాలు చేస్తానని మాట ఇచ్చాడు.
కెరిర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా చెప్పుకునే ఖుషి లాంటి హిట్‌ని ఇచ్చిన ఎస్.జె సూర్య దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కిండానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. తొలుత దీనిని మైత్రీ మూవీస్‌లో చేయాలనుకున్నా ఇప్పుడు వారిని కాదనీ త్రివిక్రమ్, శరత్ మరార్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు. దాంతో పాటు ఏఎమ్ రత్నం బ్యానర్‌లో కూడా సినిమాకు ఓకే చెప్పాడు. ఈ నాలుగు సినిమాలు చేసి సక్సెస్‌ఫుల్‌గా సినిమాల నుంచి నిష్క్రమించాలని పవన్ డిసైడయ్యాడు. మొత్తానికి తను ఆర్థికంగా సెటిల్ అవ్వాలని గబ్బర్ సింగ్ స్కెచ్ గీస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



