యాంకర్ సుమ భర్తపై రేష్మి హత్యాయత్నం..!
on Apr 16, 2016

జబర్దస్త్ పోగ్రాంతో ఫుల్ పాపులర్ అయిన రేష్మి రీసెంట్‌గా హీరోయిన్‌గా మారింది. లేటేస్ట్‌గా గుంటూరు టాకీస్ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రేష్మి ఆ మూవీలో గ్లామర్ షోతో యూత్ మతి పొగొట్టింది. ఇప్పుడు తనలో మరో యాంగిల్ చూపించబోతోంది. వి.శ్రీనివాస్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న మూవీలో రేష్మి భయపెట్టబోతోంది. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ జోడించి చారుశీల అనే చిత్రాన్ని తెరకెక్కించారు వి.శ్రీనివాసరెడ్డి. రాజీవ్ కనకాల, రేష్మి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ మంత్ ఎండింగ్‌లో రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గా ఈ చిత్ర యూనిట్ మూవీకి సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేసింది. దానిలో వీల్ చైర్‌లో కూర్చున్న రాజీవ్‌ను గొంతు నులుముతూ కనిపిస్తుంది. ఈ సినామా ద్వారా రేష్మి, రాజీవ్‌కి తప్పక అవార్డులు వస్తాయని యూనిట్ చెబుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



