వరుణ్ తేజ్ కి పోటీగా శరత్ బాబు వారసుడు!
on Aug 1, 2023

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గాండీవధారి అర్జున'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే తేదీకి సీనియర్ నటుడు శరత్ బాబు వారసుడు ఆయుష్ హీరోగా నటిస్తున్న సినిమా విడుదలవుతుండటం విశేషం.
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ లో తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా, వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దక్ష'. ఈ సినిమాతో శరత్ బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయమవుతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోన్న 'దక్ష' చిత్రాన్ని ఆగస్టు 25న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా హీరో ఆయుష్ మాట్లాడుతూ.. "రెండు సంవత్సరాల మా కష్టం ఈ సినిమా. మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎక్కడా రాజీ పడకుండా పూర్తి చేశారు. శరత్ బాబు గారికి ఈ సినిమాని అంకితం చేస్తున్నాం." అన్నారు.

మరి వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున'కి పోటీగా విడుదలవుతున్న 'దక్ష' మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మరోవైపు అదేరోజు కార్తికేయ 'బెదురులంక 2012' కూడా విడుదలవుతుండటం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



