షాకింగ్: 'బ్రో' కంటే 'బేబీ'కే ఎక్కువ.. !!
on Aug 1, 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టిస్టారర్ మూవీ 'బ్రో'.. తొలి వారాంతంలో బాగానే కలెక్ట్ చేసింది. మొదటి మూడు రోజుల్లో ఈ రీమేక్ మూవీ.. రూ. 55. 26 షేర్ ఆర్జించింది. అయితే, అనూహ్యంగా మండే టెస్ట్ లో మాత్రం 'బ్రో' సత్తా చాటలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగో రోజు కేవలం రూ. 2.96 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. జూలై నెల బాక్సాఫీస్ విజేత అయిన 'బేబీ' మాత్రం ఎలాంటి స్టార్ పవర్ లేకపోయినా.. తొలి సోమవారం 'బ్రో'కి మించి వసూళ్ళు చూసింది. ఫస్ట్ మండే టెస్ట్ లో దాదాపు రూ. 4 కోట్ల షేర్ తో బాక్సాఫీస్ ముంగిట కాసుల వర్షం కురిపించింది 'బేబీ'. మొత్తమ్మీద.. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కిన 'బ్రో' కంటే.. తక్కువ బడ్జెట్ తో, అంతగా తెలియని ముఖాలతో తీసిన 'బేబీ'నే మొదటి సోమవారం (నాలుగో రోజు) ఎక్కువ కలెక్షన్స్ చూడడం షాకింగ్ విషయమనే చెప్పాలి. కాగా, సాయి రాజేశ్ రూపొందించిన 'బేబీ'లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో నటించారు. జూలై 14న ఈ సినిమా జనం ముందు నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



