నిర్మాతని బీర్ బాటిల్‌తో కొట్టిన హీరోయిన్?
on Dec 29, 2019

సినీ తారల జీవితాల్లో మిడ్‌నైట్ పార్టీలనేవి చాలా సాధారణమనేవి మనకు తెలిసిందే. అప్పుడప్పుడు అలా పార్టీలకు వెళ్లొస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు తారలు దొరికిపోయిన సందర్భాలూ మనం చూశాం. ఇది అలాంటి కేసు కాదు కానీ, తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా నటించిన కన్నడ తార సంజన ఒక మిడ్‌నైట్ పార్టీకి వెళ్లి వివాదంలో చిక్కుకుంది. సంజన తనపై చేయి చేసుకోవడమే కాకుండా, బీరు బాటిల్ విసిరేసిందని పేరుపొందిన కన్నడ నిర్మాత వందనా జైన్.. ఆమెపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. వందన ఆరోపణ ప్రకారం బెంగళూరులోని ఒక స్టార్ హోటల్లో జరిగిన మిడ్‌నైట్ పార్టీకి ఆమె హాజరయ్యింది. దానికి సంజన కూడా వచ్చింది. ఒక విషయంపై సంజన, వందన మధ్య వాదులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సంజన తనపై భౌతికంగా దాడిచేసి, ఒక బీరు బాటిల్‌ని విసిరేసిందనేది వందన అభియోగం. ఈ మేరకు బెంగళూరులోని కుబ్బన్ పార్క్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.
అయితే వందన ఆరోపణలను సంజన ఖండించింది. తమ మధ్య వాదులాట జరిగిన విషయం నిజమే కానీ, తాను ఆమెపై దాడి చెయ్యలేదనీ, బీరు బాటిల్‌ని విసిరెయ్యలేదనీ తెలిపింది. ఏదేమైనా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంజన తెలుగులో 'బుజ్జిగాడు', 'సత్యమేవ జయతే', 'ముగ్గురు', 'దుశ్శాసన', 'యమహో యమః', 'సర్దార్ గబ్బర్‌సింగ్' వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అరుణ్ విజయ్‌తో తమిళ్ ఫిల్మ్ 'బాక్సర్' చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



