శ్రీతేజ్ ని హాస్పిటల్ నుంచి పంపించేసిన సిబ్బంది
on Apr 29, 2025
'పుష్ప 2 '(Pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4 నైట్ హైదరాబాద్ సంధ్య థియేటర్(Sandhya Theater)లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషాద సంఘటనలో రేవతి(Revathi)అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు 'శ్రీతేజ్'(Sritej)తీవ్రగాయాలకి గురవ్వడంతో పోలీసులు హాస్పిటల్ లో జాయిన్ చేసారు.
డిసెంబర్ 4 నుంచి అపస్మారక స్థితిలోనే ట్రీట్ మెంట్ తీసుకుంటు ఉన్న 'శ్రీతేజ్' రీసెంట్ గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయంపై శ్రీ తేజ్ తండ్రి మాట్లాడుతు శ్రీతేజ్ కళ్లు తెరిచి చూడటంతో పాటుగా, పదిహేను రోజుల నుంచి నోటి ద్వారా లిక్విడ్స్ లాంటివి తీసుకుంటున్నాడు. మనుషుల్ని గుర్తు పట్టకపోతున్నా స్టేబుల్ గానే ఉన్నాడు. కృత్రిమ ఆ క్సిజన్, వెంటి లెటర్ అవసరం లేదని డాక్టర్స్ చెప్పారు. ఫిజియోథెరపీ కోసం న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకెళ్తున్నామని తెలిపాడు.
శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి బాగుండటంతో అల్లుఅర్జున్(Allu Arjun)అభిమానులతో పాటు సామాన్య ప్రజానీకం సోషల్ మీడియా(Social Media)వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ తేజ్ కోలుకోవాలనే వార్త కోసం వారంతా ఎదురుచూస్తు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు అల్లుఅర్జున్, పుష్ప 2 మేకర్స్ ఫస్ట్ నుంచి శ్రీతేజ్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపెట్టారు. శ్రీతేజ్ తల్లి రేవతి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తు వారంతా భారీ ఆర్ధిక సాయం చేయడంతో పాటు, శ్రీ తేజ్ హాస్పిటల్ కి అయ్యే ఖర్చుల్ని కూడా చూసుకున్నారు. ఇక ఈ కేసులో అల్లుఅర్జున్ ఒక రోజు జైలులో ఉండటంతో పాటు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడన్న విషయం తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
