మహేష్ బాబు న్యూ లుక్.. సింహం మాదిరి ఉన్నాడు!
on Apr 29, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'SSMB29' అనేది వర్కింగ్ టైటిల్. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటిదాకా అధికారికంగా ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయలేదు. అయినప్పటికీ ఈ సినిమా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. సెట్స్ నుంచి విడుదలైన కొన్ని ఫొటోలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజా ఫొటోలయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు.
మహేష్ న్యూ లుక్ తో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో మునుపెన్నడూ చూడని లుక్ లో మహేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
యాక్షన్ సినిమాలు చేసేటప్పుడు హీరోలు గడ్డం పెంచడమో లేదా లుక్ లో ఛేంజ్ తీసుకురావడమో చేస్తుంటారు. కానీ, మహేష్ మాత్రం ఇంతకాలం యాక్షన్ సినిమాల్లో కూడా.. క్లీన్ షేవ్ తో క్లాస్ లుక్ లోనే మాస్ అంటే ఏంటో చూపించాడు. అలాంటి మహేష్, మొదటిసారి రాజమౌళి సినిమా కోసం గడ్డంతో కనిపిస్తున్నాడు. మహేష్ లుక్ చూసి అభిమానులు "సింహం మాదిరి ఉన్నాడు" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
