కలర్ ఫోటో డైరెక్టర్ తో చాందిని పెళ్లి
on Nov 11, 2024
సుహాస్(suhaas)హీరోగా, చాందిని చౌదరి(chandini chowdary)హీరోయిన్ గా 2020 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ కలర్ ఫోటో(colour photo).ఈ మూవీ ద్వారా దర్శకుడుగా పరిచయమైన వ్యకి సందీప్ రాజ్(sandeep raj)మొదటి సినిమాతోనే ఉత్తమ తెలుగు చిత్ర విభాగంలో నేషనల్ అవార్డుని కూడా అందుకొని పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు.ప్రస్తుతం రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా 'మోగ్లీ' అనే ఒక వినూత్నమైన సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పుడు సందీప్ రాజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ మేరకు సోమవారం రోజున తన ఎంగేజ్మెంట్ వైజాగ్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలని సందీప్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఒక్కసారిగా అందరకు షాక్ కి గురయ్యారు. ఎందుకంటే సందీప్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు కలర్ ఫోటో మూవీలోనే ఒక కీలక పాత్ర పోషించిన చాందిని రావు(chandini rao) ని.
ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. ఇరువైపులా పెద్దలని ఒప్పించి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు.రణస్థలి,అహం బ్రహ్మాస్మి, లవ్ డ్రైవ్ వంటి సినిమాలతో పాటు హెడ్స్ అండ్ టేల్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా చాందిని రావు నటించింది. డిసెంబర్ 7 న ఆ ఇద్దరి పెళ్లి తిరుపతిలో జరగనుంది.
Also Read